PURI : ఎట్టకేలకు పూరి జగన్నాథ్ కు ఓ హీరో దొరికేసాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూరి జగన్నాథ్‌తో ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఫలానా హీరోల చుట్టు తిరుగుతునే ఉన్నాడు కానీ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడం లేదని అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గోపీచంద్‌తో గోలీమార్ సీక్వెల్ ఫిక్స్ అయింది, నాగార్జునతో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ అయిందనే టాక్ వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఎవ్వరు ఊహించని హీరోని పట్టేశాడు పూరి. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్ అయినట్టుగా తెలిసింది.
Also Read : V.C. Sajjanar : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారి బెండు తీస్తున్న సజ్జనార్
Also Read
ఇప్పటి వరకు కెరీర్ లో విజయ్ సేతుపతి ఎన్నో విభిన్నపాత్రలు చేశాడు. మాస్టర్, విక్రమ్ సినిమాల్లో విలన్‌గా కూడా నటించాడు. ఇటీవల మహారాజా సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చివరగా విడుదల పార్ట్ 2తో మెప్పించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ పూరితో సినిమా అనేసరికి చాలా ఎగ్జైటింగ్‌గా మారింది. పూరి హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి స్టైల్ ఆఫ్ ఎలివేషన్ వేరే లెవల్లో ఉంటుంది. అలాంటి పూరి విజయ్ సేతుపతితో ఎలాంటి సినిమా చేస్తాడు అనేది మరింత ఆసక్తికరంగా మారింది. లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ డబుల్ ఫ్లాప్స్ చూసిన పూరికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది. ఖచ్చితంగా పూరి ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిందే. లేదంటే ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీనుండి తప్పుకునే పరిస్థితి వస్తుందని క్రిటిక్స్ అభిప్రాయం.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!