మాస్ మహారాజా రవితేజ చివరిసారిగా యాక్షన్ డ్రామా “క్రాక్”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్ పాత్రను పోషించాడు. ప్రస్తుతం హీరోగా “ఖిలాడి” అనే మరో యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. “ఖిలాడి” తదుపరి షెడ్యూల్ ఆగస్టు మొదటి వారంలో ప్రారంభమవుతుంది.
Read Also : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… ప్రపంచంలోనే నెం.1…!
తాజా సమాచారం ఏమిటంటే షూటింగ్‌లో ప్రణాళికల్లో పెద్ద మార్పు చోటు చేసుకుందట. “ఖిలాడి” బృందం దుబాయ్‌లో కీలకమైన షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. గల్ఫ్ నగరంలో రెండు పాటలు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ యుఎఇ అధికారులు ఇప్పటికీ వీసా దరఖాస్తులను అంగీకరించనందున “ఖిలాడి” మేకర్స్ ఆ ఆలోచనను విరమించుకున్నారని సమాచారం. అక్కడ అనుకున్న షెడ్యూల్ ను హైదరాబాద్లో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ బృందం హైదరాబాద్‌లో పాటల షూటింగ్ కోసం భారీ సెట్లను ఏర్పాటు చేస్తోంది. ఇక రవితేజ “ఖిలాడీ”తో పాటు “రామరావు ఆన్ డ్యూటీ”లో నటిస్తున్నారు. ఇందులో ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు.