పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిస్కారం చూపించడంలో రియల్ పవర్ స్టార్ అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర అభివుద్దిలో భాగమై ముందుకు నడిపిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీపై నటి భూమిక చావ్లా ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read : JanaNayagan : విజయ్ ‘జననాయగన్’ కు మరో షాక్ ఇచ్చిన కోర్టు
యూరోపియా సినిమా ప్రమోషన్ లో భాగంగా భూమిక మాట్లాడుతూ ‘ఖుషి’ సినిమాలో ఆయనతో కలిసి నటించిన రోజులను గుర్తుచేసుకుంటూ, అప్పటి నటుడు పవన్ కళ్యాణ్ నుంచి నేటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. సినీ ప్రయాణం నుంచి ప్రజాసేవ వైపు అడుగులు వేయడం, ఆ తర్వాత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం నిజంగా అభినందనీయం. ఆయన కష్టపడి సాధించిన ఈ స్థాయి ఎంతో మందికి ఆదర్శం. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, ప్రజల కోసం మరింత గొప్ప సేవ చేయాలని కోరుకుంటున్నాను అని పవర్ స్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు. భూమిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఖుషిలో పవన్ కళ్యాణ్ – భూమిక అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
