Site icon NTV Telugu

Bheems Ceciroleo : సీనియర్ కంపోజర్లతో ట్రెండ్ సెట్ చేస్తున్న భీమ్స్..

Bheems

Bheems

‘వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే’ అంటూ ఫస్ట్ సాంగ్‌తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు కంపోజర్ భీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ధమాకా, బలగం చిత్రాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మాసీ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు భీమ్స్. ఇక ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్స్‪తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌కు ఫీస్ట్ ఆల్బమ్స్ ఇచ్చాడు.

Also Read : Vaa Vaathiyaar : కార్తీకి తలనొప్పిగా మారిన డైరెక్టర్

ఇదిలా ఉంటే భీమ్స్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఫేడవుటయిన మ్యూజిక్ డైరెక్టర్లకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్‌ను తన సాంగ్స్‌తో ఓ ఊపు ఊపేసిన రమణ గోగులతో సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టుమీద సాంగ్ పాడించాడు. పెక్యూలర్ వాయిస్‌తో రమణ గోగుల పాడితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సింగిల్ సినిమాకు ప్లస్సై బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆయన పాడిన లిరికల్ వీడియోకు యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రజంట్ ఆ వీడియో 220 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళుతోంది. ఇప్పుడు మాస్ జాతర కోసం దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్‌నే క్రియేట్ చేశాడు. ఏఐ సాయంతో చక్రి లేడనే విషయాన్ని మైమరిపించేలా చేశాడు భీమ్స్. తు మేరా లవర్ అంటూ సాగే పాటను రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇడియట్ సినిమాలో చూపుల్తో గుచ్చి గుచ్చి పాట మ్యూజిక్ బిట్ యూజ్ చేసి చక్రికి సరైన ట్రిబ్యూట్ ఇచ్చాడు భీమ్స్. అలాగే ఐకానిక్ స్టెప్పులు రీ క్రియేట్ చేశారు రవితేజ అండ్ శ్రీలీల. దీంతో వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటున్నారు అతడి ఫ్యాన్స్. ఇలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యాజిక్ ను ఈ జనరేషన్ యూత్ కు రుచి చూపిస్తున్నాడు భీమ్స్.

Exit mobile version