NTV Telugu Site icon

Raj Tarun: ఎంతకు తెగించార్రా? రాజ్ తరుణ్ కి మ్యాటర్ లేదని అందుకే చెప్పారా?

Raj Tarun News Samyukt

Raj Tarun News Samyukt

Bhale Unnade team Sensational Promotions: గత కొంతకాలంగా లావణ్య, మాల్వి మల్హోత్రా ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎక్కువగా రాజ్ తరుణ్ వార్తలో నిలుస్తూ వచ్చాడు. అయితే అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం రాజ్ తరుణ్ పేరు ప్రస్తావించకుండా కొద్ది రోజులుగా మీడియాలో నానుతున్న హీరో అని చెబుతూ సంయుక్త అనే యువతి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో హీరో పేరు మెన్షన్ చేయకుండా అతను కడుపులు చేశాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కానీ అతను ఆ విషయంలో చాలా వీక్, అని ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారో తనకు తెలియడం లేదు అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. వెంటనే మీడియాలో కూడా ప్రధానంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైరల్ చేశారు. సదరు యువతీ మాట్లాడుతూ తన ఫ్రెండ్ అదే వ్యక్తితో డేటింగ్ లో ఉందని అయితే ఒక ముద్దు ముచ్చట కూడా లేదని తనకు చెప్పి బాధపడిందని చెప్పుకొచ్చింది.

Raksha Bandhan: అన్నా- చెల్లెలి అనుబంధం.. టాలీవుడ్ హీరోలకు వరం

చూడ్డానికి బానే ఉంటాడు కానీ మేటర్ లేదని, త్వరలోనే తన ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చాక పూర్తి సాక్షాధారాలతో మీ ముందు నిలబెడతామని చెప్పుకొచ్చింది. అతను 26 వేలకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు 30 దాటిన చేసుకోలేదు. ఎందుకంటే మ్యాటర్ లేదు అనే విషయం అతనికి కూడా తెలుసు. అందుకే అతను డేట్ చేసే అమ్మాయి ఎవరెవరినో పిలవమని అడిగినా పట్టించుకోకుండా ఏదో లోకంలో ఉన్నాడని కామెంట్ చేసింది. అయితే ఇదంతా నిజమేనని నమ్మారు చాలామంది. కానీ అసలు విషయం ఏమిటంటే రాజ్ తరుణ్ హీరోగా భలే ఉన్నాడే అనే సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు అందరూ ఎంతకు తెగించారురా? ఇలా కూడా ప్రమోషన్స్ చేస్తారా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో రాజ్ తరుణ్ చీరలు కట్టే వృత్తి గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు.