Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే.. ఫ్లాప్ పరంపరకు బ్రేకులేసింది లెనిన్. మిస్టర్ బచ్చన్ నుండి ఆంధ్రా కింగ్ తాలూకా వరకు గ్లామర్ ట్రీట్ ఇచ్చినా.. ఫెర్ఫామెన్స్ రోల్స్ చేసినా సక్సెస్ పలకరించలేదు. భాగ్యశ్రీపై ఐరన్ లెగ్ ముద్ర పడిపోతున్న టైంలో లెనిన్ మూవీ ఆమెను సేవ్ చేసింది. భాగ్యశ్రీకే కాదు.. సరైన హిట్ లేక స్ట్రగుల్ పడుతోన్న అఖిల్ ఖాతాలోనూ ఓ బ్లాక్ బస్టర్ పడింది.
ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడే భాగ్యశ్రీకి ఆఫర్స్ ఇచ్చి ఆదుకుంది టాలీవుడ్. కానీ హిట్ కొట్టాక మేకర్స్ లైట్ తీసుకున్నట్లున్నారు. లెనిన్ తర్వాత మరో తెలుగు మూవీకి సైన్ చేసిన దాఖలాలు లేవు భామ. భాగ్యశ్రీ కూడా ఇదే ఇండస్ట్రీలో గిరిగీసుకుని కూర్చోకుండా పొరుగు ఇండస్ట్రీలపై ఫోకస్ చేస్తోంది. ఇప్పటికే కాంతలో తన ఫెర్ఫామెన్స్తో తమిళ తంబీలకు చేరువైన మహాలక్ష్మీ.. నెక్ట్స్ శివకార్తికేయన్ సరసన సేయాన్ చేస్తోంది. త్వరలో మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. తొలి స్టెప్‌లోనే మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది భాగ్యశ్రీ బోర్సే. 2022లో రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆ దేశంలో చిక్కుకుపోయిన దేశ పౌరులను కాపాడేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ విష్ణు మోహన్. శ్రీ గోకులం మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ మూవీకి ధురంధర్ ఫేమ్ శాశ్వత్ సచ్ దేవ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అర్జున్ రాంపాల్, పార్తీ బన్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆపరేషన్ గంగాతో భాగ్యశ్రీ బోర్సే మాలీవుడ్ ఆడియన్స్ మది దోచేస్తుందో లేదో తెలియాలంటే నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సిందే.
Also Read
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
తాజావార్తలు
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!