NTV Telugu Site icon

Betting Apps Case: సుప్రీత, విష్ణుప్రియ, రీతు చౌదరి సహా 11 మందిపై ‘బెట్టింగ్’ కేసు !

ద

హైదరాబాద్ సిటీ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. ఈ యూట్యూబర్లు వ్యూస్ ద్వారా వస్తున్న ఆదాయం కంటే మించి ఆదాయం వస్తుండడంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజు వంటి ప్రముఖ యూట్యూబర్ల మీద కేసు నమోదైంది. ఇక పోలీసుల విచారణలో, ఈ యూట్యూబర్లు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా బెట్టింగ్ యాప్స్‌ను ప్రచారం చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని తప్పుడు ఆశలు రేకెత్తిస్తున్నట్లు తేలింది.

Tollywood: హీరోలు అందరూ ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నారో తెలుసా?

ఈ ప్రమోషన్స్ ద్వారా వారు యాప్ నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని సమాచారం. ఈ కారణంగా చాలా మంది ఆర్థికంగా నష్టపోయి, కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు సూసైడ్ కూడా చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌ను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కేసులు యూట్యూబర్లకు హెచ్చరికగా నిలుస్తాయని, సమాజంలో బెట్టింగ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలు కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు. ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.