Best Credit Cards for Movie Offers: ఈ క్రెడిట్ కార్డులు ఉంటే సరి.. ఉచితంగా సినిమాలు చూడొచ్చు.. లేదా 50 శాతం డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best Credit Cards for Movie Offers: సినిమాలు చూడటం చాలా మందికి ఇష్టమైన వినోదం.. అయితే, ప్రధాన నగరాల్లోని మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్ ధరలు పెరుగుతుండటంతో సినిమా చూడటం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది.. ఓ కుటుంబం వెళ్లి సినిమా చూడాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితిలో, సినిమా టిక్కెట్లపై తగ్గింపులు, ఉచిత టిక్కెట్లు అందించే క్రెడిట్ కార్డులు ప్రేక్షకులకు మంచి ఉపశమనం ఇస్తున్నాయి. BookMyShow, Paytm Movies మరియు PVR Cinemas వంటి ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం ద్వారా బ్యాంకులు ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నాయి.
1. పీవీఆర్ కోటక్ గోల్డ్ క్రెడిట్ కార్డ్
* తరచుగా PVR Cinemas కు వెళ్లే వారికి ఇది మంచి ఎంపిక.
* నెలకు రూ.10,000 ఖర్చు చేస్తే రూ.400 విలువైన ఒక ఉచిత టిక్కెట్
* రూ.15,000 ఖర్చు చేస్తే రెండు ఉచిత టిక్కెట్లు
* ఫుడ్ & బేవరేజెస్‌పై 20 శాతం తగ్గింపు పొందవచ్చు..
– వార్షిక రుసుము: రూ.499
Also Read
2. ఐసీఐసీఐ బ్యాంక్ కోరల్ క్రెడిట్ కార్డ్
* BookMyShow లేదా INOX ద్వారా బుకింగ్‌పై 25 శాతం తగ్గింపు
* గరిష్టంగా రూ.100 వరకు డిస్కౌంట్
* నెలకు 2 సార్లు మాత్రమే ఆఫర్
– వార్షిక రుసుము: రూ.500
3. ఎస్బీఐ కార్డ్ ఎలైట్
* BookMyShow ద్వారా నెలకు 2 ఉచిత టిక్కెట్లు (రూ.250 వరకు)
* సంవత్సరానికి రూ.6,000 విలువైన టిక్కెట్లు
– వార్షిక రుసుము: రూ.4,999
4. ఆర్బీఎల్ బ్యాంక్ ప్లే క్రెడిట్ కార్డ్
* నెలకు రూ.5,000 ఖర్చుపై 2 ఉచిత టిక్కెట్లు (రూ.250 వరకు)
* ఫుడ్ & డ్రింక్స్‌పై రూ.100 తగ్గింపు
– వార్షిక రుసుము: రూ.500
5. హెచ్డీఎఫ్సీ ప్లాటినం టైమ్స్ క్రెడిట్ కార్డ్
* BookMyShow పై 50 శాతం తగ్గింపు
* నెలకు గరిష్టంగా రూ.600 వరకు డిస్కౌంట్
* 4 టిక్కెట్ల వరకు ఆఫర్
– వార్షిక రుసుము: రూ.1,000
6. YES బ్యాంక్ మార్కీ క్రెడిట్ కార్డ్
* Buy One Get One (BOGO) ఆఫర్లు
* ఒక్కో టిక్కెట్‌పై రూ.800 వరకు తగ్గింపు
– వార్షిక రుసుము: రూ.4,999
7. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్
* ప్రతి టిక్కెట్‌పై 10 శాతం తగ్గింపు
* గరిష్టంగా రూ.100 వరకు డిస్కౌంట్
– వార్షిక రుసుము: రూ. 250
8. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజీడైనర్ క్రెడిట్ కార్డ్
* నెలకు రూ.200 విలువైన టిక్కెట్లు
* EazyDiner ద్వారా 25 శాతం డైనింగ్ తగ్గింపు
– వార్షిక రుసుము: రూ.1,999
అయితే, సినిమా ప్రేమికులకు ఈ క్రెడిట్ కార్డులు మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి. ఉచిత టిక్కెట్లు, BOGO ఆఫర్లు, 50 శాతం వరకు తగ్గింపులతో మీ వినోద ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అయితే, ప్రతి కార్డ్‌కు సంబంధించిన షరతులు, వార్షిక రుసుములు, వినియోగ నిబంధనలు తెలుసుకొని మీ అవసరాలకు సరిపడే కార్డును ఎంచుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!