బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న స్పై థ్రిల్లర్ “బెల్ బాటమ్”. ఇందులో వాణి కపూర్, హుమా ఖురేషి, లారా దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. అక్షయ్ రా ఏజెంట్ పాత్ర పోషిస్తుండగా, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రను లారా దత్తా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించారు. ‘బెల్ బాటమ్’ 80వ దశాబ్దంలో ఇండియాలో అలజడి సృష్టించిన విమానం హైజాక్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రానికి రంజిత్ తివారి దర్శకత్వం వహించగా పూజ ఎంటర్టైన్మెంట్స్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా అక్షయ్ ప్రకటించాడు. “బెల్ బాటమ్” షార్ట్ టీజర్‌ను పంచుకున్న అక్షయ్ కుమార్ ఈ చిత్రం థియేటర్లలో విడుదల చేయనున్నారని, జూలై 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది అని తెలిపారు. కాగా అక్షయ్ ఈ సినిమా కోసం తన రెమ్యూనిరేషన్ ను భారీగా తగ్గించుకున్నాడు అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫేక్ న్యూస్ అంటూ ఈ వార్తలను అక్షయ్ కొట్టిపారేశారు.