Bapu Bomma Vishwa Mahila Awards: ‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డ్స్.. కొణిదెల అంజనా దేవికి పురస్కారం!
- 'బాపు బొమ్మ-విశ్వ మహిళ' అవార్డ్స్ 2026 కార్యక్రమం
- కొణిదెల అంజనీ దేవికి పురస్కారం
- సినిమా, సామాజిక, రాజకీయ రంగాల్లోనూ దివ్యవాణి ప్రత్యేకత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటి దివ్యవాణి చౌదరి ఆధ్వర్యంలో ‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డ్స్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. తెలుగు ప్రజల గుండెల్లో బాపుబొమ్మగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివ్యవాణి.. సినిమా రంగంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు సౌజన్యంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డ్స్ వేడుకకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, తెలుగు వన్ అధినేత కంఠంనేని రవిశంకర్, ప్రముఖ నటుడు-రచయిత హర్షవర్ధన్, డిప్యూటీ కలెక్టర్ ఇ. వెంకటాచారి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం. కిరణ్ కుమార్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న మహిళలను సన్మానించారు. అవార్డులు అందుకున్న వారిలో మెగా మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనీదేవి, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్రీమతి శ్యామలాదేవి, యాంకర్ స్వప్న, జనేతా కంచర్ల (యుఎస్‌ఏ), డాక్టర్ వెన్నెల గద్దర్, డాక్టర్ పద్మజా చంద్రకాంత్, సమీరా భరద్వాజ్, రేఖారాణి, డి. జ్యోతిరెడ్డి (యుఎస్‌ఏ) తదితర ప్రముఖ మహిళలు ఉన్నారు.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
సినిమా రంగంతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లో విశేష సేవలందిస్తున్న దివ్యవాణి ప్రారంభించిన ‘బాపు బొమ్మ-విశ్వ మహిళ’ అవార్డులను మెగా మాతృమూర్తి కొణిదెల అంజనా దేవితో ప్రారంభించడం ఎంతో అభినందనీయమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. సమాజంలో విశేష సేవలు చేస్తున్న మహిళలను సన్మానించడం ద్వారా ఇతర మహిళలకు స్ఫూర్తినివ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ దివ్యవాణి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా.. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దివ్యవాణి చెప్పారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!