టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్.. మూవీస్ విషయం పక్కన పెడితే చేతికి మైక్ అందితే చాలు.. అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంటాడు. ఆయన ఎవరినైనా పొగిడినా, తిటిన అది టాప్ గేర్‌లోనే ఉంటుంది. గత నెల లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్‌కు వచ్చి ఆ టీం మీద ప్రశంసలు కురిపిస్తూనే.. కొందరు ఇండస్ట్రీ ప్రముఖుల మీద పంచ్‌లు వేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇటీవలే తన ఇంట్లో ఇండస్ట్రీ ప్రముఖులకు ఇచ్చిన దీపావళి పార్టీతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. తాజాగా సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన ‘తెలుసు కదా’ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొని, ఆయన మాట్లాడుతూ.. మరోసారి వార్తల్లో నిలిచారు..
Also Read : Mirai’s triumph : ఘనంగా జరిగిన ‘మిరాయ్’ విజయోత్సవ వేడుక..
ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ, “మీడియా చిన్న చూపు చూస్తే సెలబ్రిటీలకు కూడా భయం కలుగుతుంది. ఇండస్ట్రీలో ఎప్పుడు మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ‘తెలుసు కదా’ సినిమా చాలా బాగుంది. సిద్ధూ జొన్నలగడ్డ అద్భుతంగా నటించారు. రవితేజ స్థానంలో సిద్ధూను చూస్తున్నట్లు అనిపిస్తుంది. రానున్న 20 ఏళ్లు ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా నడుస్తోంది, ‘తెలుసు కదా’ వంటి సినిమాను నిర్మించడానికి ధైర్యం కావాలి, ప్రొడ్యూసర్ టి.జి. విశ్వప్రసాద్ ను నేను ఈ విషయంలో అభినందిస్తున్న. సిద్ధూకు మంచి భవిష్యత్తు ఉంది. ప్రేమలో ఉన్న వారు, కొత్తగా పెళ్లైన వారంతా ఈ సినిమా తప్పక చూడాలి. విశ్వ ప్రసాద్ మాలాంటి నిర్మాతలందరికీ స్ఫూర్తి” అని గణేశ్ తెలిపారు. తన ప్రొడక్షన్ ఫిల్మ్ కెరియర్ గురించి కూడా మాట్లాడిన ఆయన.. “‘టెంపర్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను” అని పేర్కొన్నారు.
