Bandi Saroj: బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ రిలీజ్ ఎప్పుడంటే..?
- నటుడు - డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ తాజా చిత్రం 'పరాక్రమం'
- టీజర్ రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ - SKN
- పరాక్రమం సెకండ్ సాంగ్ రిలీజ్ చేసిన యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోల్డ్ సినిమాలతో పాపులర్ అయిన నటుడు, డైరెక్టర్ బండి సరోజ్ కుమార్. గతంలో ఈ దర్శకుడు నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం వంటి సినిమాలను తెరకెక్కించి నేరుగా సోషల్ మీడియాలో రిలీజ్ చేసేవాడు. తాజాగా గల్లీ క్రికెట్, లవ్ కాన్సెప్ట్ తో మరో బోల్డ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఈ డైరెక్టర్. బిఎస్.కె.మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ టీమ్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఆ మధ్య ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ కి విశ్వక్ సేన్, బుచ్చిబాబు, నిర్మాత SKN గెస్టులుగా హాజరయిటీజర్ రిలీజ్ చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది.
Also Read: Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?
Also Read
ఈ నేపథ్యంలో ఈ రోజు “పరాక్రమం” సినిమా నుంచి ‘డ్రీమ్’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘డ్రీమ్’ సాంగ్ కు దర్శకుడు బండి సరోజ్ కుమార్ ఆకట్టుకునేలా లిరిక్స్ రాసి బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీ వైష్ణవి గోపరాజు అందంగా పాడారు. ‘వచ్చాడులే పరాక్రమం..నా కన్నె మనసు చేరే కొత్త సంగమం తెచ్చాడులే పరాక్రమం నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం అంటూ అమ్మాయి తన మనసులోని తొలిప్రేమ భావాలను చెప్పేలా లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లవ్, యాక్షన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ వంటి ఎలిమెంట్స్ తో “పరాక్రమం” సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చేలా రూపొందించారు బండి సరోజ్ కుమార్. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది పరాక్రమం.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!