Kota Srinivas Death : కోట శ్రీనివాస్ మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినిమాలతో పాటు రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో జాతీయ, నంది అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఉమ్మడి ఏపీలో బీజేపీని ఆయన గుర్తించారు. అసెంబ్లీలో సినీ రంగ సమస్యలపై నిత్యం మాట్లాడేవారు. కోట శ్రీనివారావు మరణం భారతీయ జనతా పార్టీకి, సినిమా రంగానికి తీరని లోటు. వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ చెప్పారు బండి సంజయ్.
Read Also : Kota Srinivas Death : కోట మరణ వార్త బాధాకరం.. ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ నివాళి..
ఎంపీ ఈటల రాజేందర్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ లీడర్, కోట శ్రీనివాస్ రావు మరణం బాధ కలిగించింది. ఆయన రాజకీయాల్లో, అటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేశారు. విలక్షణ నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాస రావు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు ఈటల.
Read Also : Kota Srinivasa Rao : కోట శ్రీనివాసరావు జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్..
