NTV Telugu Site icon

పాక్ లో “షేర్ షా”పై బ్యాన్… కారణం ఇదేనా ?

Ban on Shershaah Movie at Pakisthan

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన వార్ మూవీ “షేర్ షా” ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. అమరవీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆగష్టు 12న అమెజాన్‌లో విడుదలైంది. మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా నటన అందరినీ ఆకట్టుకుంటోంది. కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఈ ఏడాది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉండగా “షేర్ షా” చిత్రాన్ని పాకిస్థాన్‌లో బ్యాన్ చేసిన మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read Also : ఓటీటీ కోసం తెలుగులో మరో కొత్త ‘బిగ్ బాస్’

ఓ ప్రముఖ మీడియా సంస్థ సమాచారం ప్రకారం ఒక పాకిస్థానీ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఈ విషయం గురించి వెల్లడించాడు. పాకిస్తాన్‌లో ఈ సినిమాను బ్యాన్ చేశారని, అయినప్పటికీ తాను ఆ సినిమాను చూడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే ఈ చిత్రం పాకిస్తాన్‌లో విడుదల చేశారా ? లేదా? అనే విషయంపై అధికారిక అప్‌డేట్ రాలేదు.

అయితే పాకిస్తాన్ మన ఇండియా కెప్టెన్ విక్రమ్ బాత్రా చేసిన సాహసాన్ని పాకిస్తానీ ప్రజలకు చూపించడానికి ఇష్టపడటం లేదని, అందుకే బ్యాన్ చేసి ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా విక్రమ్ బాత్రా తన ప్రాణాలను లెక్క చేయకుండా పాకిస్తానీలను చంపినట్లు చిత్రంలో చూపించారు. పాకిస్తాన్‌లో భారతీయ చిత్రాన్ని బ్యాన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా “ఫాంటమ్” చిత్రం విడుదలను నిషేధించారు. ఈ చిత్రం హుస్సేన్ జైదీ నవల ‘ముంబై ఎవెంజర్స్’ ఆధారంగా రూపొందించబడింది. ఇంకా బంగిస్తాన్, ఏక్ థా టైగర్, రాజనా, భాగ్ మిల్ఖా భాగ్, ఏజెంట్ వినోద్, తేరే బిన్ లాడెన్, లాహోర్ వంటి అనేక సినిమాలను అక్కడ ప్రదర్శించకుండా బ్యాన్ చేశారు.

Show comments