NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..

Nbk

Nbk

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఆయన అభిమానులకు సరికొత్త ‘డబుల్ ట్రీట్’ అందబోతోంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 10న బాలయ్య బర్త్ డే కి ఒక కొత్త సినిమా అప్‌డేట్ రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఒకటి కాదు, ఏకంగా రెండు భారీ క్రేజీ ప్రాజెక్టుల నుండి ఊహించని సర్ప్రైజ్లు రాబోతున్నట్టుగా సమాచారం.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’ చిత్రం షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కాగా అక్కడ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడం అలాగే ఈ సరికొత్త చిత్రంలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి . ఈ క్రేజీ చిత్రం నుండి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ఫుల్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది

×
×
Ad

దీనితో పాటు ఇటీవల అధికారికంగా ప్రకటించిన ‘NBK 112’ ప్రాజెక్ట్ నుండి కూడా ఒక బిగ్ అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ను బాలయ్య బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక అంశాలను కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి చూపించడంలో దిట్ట అయిన కొరటాల శివ, బాలకృష్ణ ఇమేజ్ కు సరిపోయే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. మొత్తానికి మాస్ పల్స్ బాగా తెలిసిన గోపీచంద్ మలినేని, కొరటాల శివ వంటి ఇద్దరు స్టార్ డైరెక్టర్ల సినిమాల నుండి ఒకేసారి అప్‌డేట్స్ రాబోతుండటంతో నందమూరి అభిమానులకు జూన్ 10న అసలైన పండగ మొదలుకానుంది