NTV Telugu Site icon

Balayya: సత్తా చాటిన బాలయ్య భగవంత్ కేసరి.. మ్యాటర్ ఏంటంటే..?

Untitled Design (29)

Untitled Design (29)

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకిృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఒకవైపు హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజలకు సేవచేస్తూ, మరోవైపు కథానాయకుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ హీరో. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్టున్నాడు. ఆ ఏడాది డిసెంబరు లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read: Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల

మరోవైపు గతేడాది బాలయ్య నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం భగవంత్ కేసరి సూపర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రంలోని బాలయ్య నటనకు విశేష స్పందన లభించింది. వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య అలరించాడు. ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా నటించిన శ్రీలీలకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు భగవంత్ కేసరి టాపిక్ ఎందుకు వచ్చిందంటే. నటీవటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఐఫా(IIFA) అవార్డ్స్ నామినేషన్స్ లో బాలయ్య భగవంత్ కేసరి 4 కేటగిరిస్ లో నానినేషన్స్ లో నిలిచింది. బెస్ట్ సినిమా, బెస్ట్ ఫర్ఫామెన్స్ లీడింగ్ రోల్ (మేల్), బెస్ట్ డైరక్టర్, బెస్ట్ పర్ఫామెన్స్ లీడింగ్ రోల్ (ఫీమేల్) విభాగాలలో భగవంత్ కేసరి నామినేషన్స్ లో నిలిచింది. బాలయ్య మిగతా సినిమాలతో పోలిస్టే భగవంత్ కేసరి చాలా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఉంటుంది. థియేటర్లలో సూపర్ హిట్ అయినా ఈ చిత్రం బుల్లితెరపై కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అవార్డ్స్ కూడా తెస్తుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తణ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్ల భారీ ఎత్తున జరగనున్న IIFA అవార్డ్స్ వేడుకలో భగవంత్ కేసరి ఎన్ని అవార్డులు కొల్లగొడుతుందో చూడాలి..

Show comments