Site icon NTV Telugu

Balakrishna : ‘అఖండ 2’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Akanda 2

Akanda 2

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా.. అంటే బాక్స్ ఆఫీస్ బద్దలు కావడం పక్క. అలాంటిది ఇప్పుడు ‘అఖండ’ లాంటి సంచలనాత్మక చిత్రానికి సీక్వెల్ తో వీళ్ళు మన ముందుకు రాబోతున్నారంటే, ఇక ఏ రేంజ్ బజ్ ట్రేడ్‌లో ఉంటుందో చెప్పకర్లేదు. గత ఏడాది నుండి విరామం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ మూవీలో హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. ఇందులో ఒక పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో లేడీ సూపర్ స్టార్ సీనియర్ నటి విజయశాంతి కూడా నటించబోతుందని టాక్. రీసెంట్ గానే ఆమెను కలిసి బోయపాటి శ్రీను ఈ స్టోరీని, ఆమె పాత్ర గురించి  వివరించగా.. దీంతో ఈ చిత్రంలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

Also Read: Gymkhana : మళ్లీ నోరు జారిన డైరెక్టర్ హరీష్ శంకర్

దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక షూటింగ్ సెట్స్‌లో ఉన్నప్పుడే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ అనేక ప్రాంతాల్లో పూర్తి కాగా.. బాలయ్య కెరీర్ లోనే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఈ చిత్రం ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయట. అయితే తాజాగా మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.. ఏంటీ అంటే నెల రోజుల షెడ్యూల్ కోసం ఈ చిత్ర బృందం వచ్చే నెలలో జార్జియాకు వెళుతోంది. మే నెల అంతా జార్జియాలోనే షూటింగ్ చేస్తారట. అంతేకాదు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న టీజర్ విడుదల కాబోతుందట.

Exit mobile version