ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసి దర్శకుడిగా మారాడు వేణు. జబర్దస్త్ వేణుగా ఉన్న అతను బలగం అనే సినిమా చేసి బలగం వేణుగా రూపాంతరం చెందాడు. అయితే బలగం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మనోడు ఎవరితో సినిమా చేస్తాడా అని అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి ఉంది. నాని హీరోగా ఎల్లమ్మ అనే సబ్జెక్టు చేయడానికి వేణు విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయితే అది వర్కౌట్ కాకపోవడంతో అదే సబ్జెక్టు నితిన్ హీరోగా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక విషయంలో చాలా పట్టుదలగా వేణు ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో నితిన్ పక్కన సాయి పల్లవిని హీరోయిన్గా నటింప చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సాయి పల్లవి లైనప్ ప్రకారం ప్రస్తుతం ఆమె డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు.
KTR: ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మెందుకు కుట్ర
దీంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ఎలా అయినా ఆమెతోనే ఆ క్యారెక్టర్ చేయించాలని ఒకవేళ ఆమె కుదరని పరిస్థితులలో సంయుక్త మీనన్ సహా మరి కొంతమంది హీరోయిన్లను పరిశీలించాలని భావిస్తున్నారట. ప్రస్తుతానికి వేణు ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ముంబై వెళ్ళాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుల ధ్వయం అజయ్ -అతుల్ సంగీతం అందించబోతున్నారు. వారితో పాటు మ్యూజిక్ సిటింగ్స్ లో కూర్చునేందుకు బలగం వేణు ముంబై బయలుదేరి వెళ్ళాడు. హీరోయిన్ ఫైనల్ అయిన తర్వాత అధికారిక ప్రకటన చేసి సినిమాని పట్టాలు ఎక్కించే ప్రయత్నాలు చేయబోతున్నారు.