NTV Telugu Site icon

BachhalaMalliTeaser : అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ టీజర్ వచ్చేసింది.

Bacchalamalli

Bacchalamalli

అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ కు జోడిగా ఈ హనుమాన్ సినిమా నటి అమృత అయ్యర్ నటిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రంలోని అల్లరి నరేష్ ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన లభించింది. గతంలో రిలీజ్ చేసిన ‘బచ్చల మల్లి’ ఫస్ట్ గ్లింప్స్ తోనే ఈ సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్,

 

నేడు ఈ సినిమా టీజర్ అమీర్ పెట్ లోని AAA సినిమాస్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్.  టీజర్ ఆద్యంతం మాస్ యాక్షన్ నేపథ్యంలో 1990 లో సాగే ఈ కథలో అల్లరి నరేష్ మాస్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు. ఇక ‘నేను ఎవ్వరి కోసం మారను నాకు నచ్చినట్లు నేను బతుకుతా’ వంటి డైలుగ్స్ అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. సోలోబ్రతుకె సో బెటర్ సినిమాతో ఆకట్టుకున్న సుబ్బు మంగదేవి దర్శకత్వంలో రూపొందుతున్న నరేష్ కెరియర్ లో  బెస్ట్ సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, హిట్టు కొడుతున్నాం అని  అన్నారు నిర్మాత రాకేష్ దండు. నా జీవితంలో చేసిన పెద్ద పొరపాటు నుంచి నేర్చుకున్న పాఠం నుండి ఈ  బచ్చలమల్లి చేశాను అని అన్నారు దర్శకుడు. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఈవెంట్ కు చిత్ర హీరో అల్లరి నరేష్ ట్రాక్టర్ లో రావడం కోసమేరుపు.

Also Read : OTT : ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే

Show comments