NTV Telugu Site icon

Bachhala Malli : అల్లరి నరేశ్ ‘బచ్చల మల్లి’ రిలీజ్ డేట్ ఇదే..

Allari Naresh

Allari Naresh

హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథబలం ఉన్న సినిమాలు మాత్రేమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. మొన్నమధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూసాడు.

Also Read : Kanguva : 12 నిమిషాల సీన్స్ ట్రిమ్ చేసిన కంగువ మేకర్స్

దాంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలి అని మరోసారి సీరియస్ సబ్జెట్ తో బచ్చల మల్లి అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిజీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. యూనిట్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాను డిసెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్టు ఫిక్స్ చేశారట. త్వరలోనే ఇందుకు సంభందించి అధికారక ప్రకటన రానుందట. ఇప్పటికె ఈ రేస్ లో బెల్లం కొండ ‘భైరవం’, నితిన్ రాబిన్ హుడ్ తో పాటు మరో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా విజయంతో సక్సెస్ ట్రాక్ వస్తానని ధీమాగా ఉన్నాడు అల్లరి నరేష్.

 

Show comments