Site icon NTV Telugu

Mr Bachchan: విడుదలకు ముందే స్పెషల్ ప్రీమియర్స్ తో సందడి చేయనున్న బచ్చన్

Untitled Design (51)

Untitled Design (51)

పీపుల్స్ మీడియా అత్యంత భారీగా నిర్మిస్తున్న చిత్రం మిస్టర్ బచ్చన్. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ హరిశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన మిరపకాయ్ సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి మాస్ రీయూనియన్ ను చూసేందుకు అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్ కథానాయకగా నటించనుంది.

కాగా మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని స్వాతంత్రాదినోత్సవం కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నామని ఇదివరకే ప్రకటించింది పీపుల్స్ మీడియా సంస్థ. కానీ విడుదలకు ఒకరోజు ముందు ఆగస్టు 14న స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్టు అధికారంగా ప్రకిటించిది నిర్మాణ సంస్థ. ఈ స్పెషల్ ప్రీప్రీమియర్స్ USA తో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శిస్తారా ఒకవేళ ప్రదర్శిస్తే కేవలం సెలెక్టెడ్ థియేటర్స్ లో మాత్రమే వేస్తారా అన్న విషయం క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మిస్టర్ బచ్చన్ టీజర్ డేట్ ను రోజు  మధ్యాహ్నం  12:06గంటలకు అనౌన్స్ మెంట్ చేయనుంది సదరు ప్రొడక్షన్ హౌస్. మరి కొద్దీ రోజుల్లో విడుదల కానున్న మిస్టర్ బచ్చన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఆంధ్ర 18 కోట్ల రూపాయల రేషియోలో అమ్మకాలు చేసారు. డిజిటల్ రైట్స్ ను ఇప్పటికె నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని నైజాంలో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేయనుంది. దాదాపు 90 కోట్ల రూపాయల బడ్జెట్ తో TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

Also Read: Kollywood : మైల్ స్టోన్ సినిమాలతో సెన్సషనల్ హిట్ కొట్టిన హీరోలు ఎవరో తెలుసా..?

Exit mobile version