Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Nakshatra: మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ సినిమాలో నటించిన చిన్నారి నక్షత్రపై దర్శకుడు శివ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా కోసం ఆమె చూపించిన ధైర్యం, అంకితభావం, ఎమోషనల్ సీన్లలో నటన గురించి చెబుతూ నక్షత్ర మదర్ని, అంకుల్‌ను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నక్షత్ర గురించి తనకు తెలిసిన ఒక విషాయాన్ని పాప పర్మిషన్ ఈ వేదికపై డైరెక్టర్ వెల్లడించారు. సినిమాలో ఆడపిల్లలు ధైర్యంగా పెరగాలని, ధైర్యంగా పెంచాలని చెబుతుంటామని అన్నారు. అయితే నక్షత్రలాంటి ధైర్యం, గట్టి గుండె ఉన్న చిన్నారిని తాను ఎక్కడా చూడలేదని ప్రశంసించారు. తాను ఇప్పుడు చెప్పే విషయానికి నక్షత్ర అనుమతి ఇప్పుడే తీసుకున్నానని వెల్లడించారు.
షూటింగ్ ప్రారంభించినప్పుడు నక్షత్రకు తెలుగు విషయంలో చాలా కాన్షియస్గా ఉండేదని శివ తెలిపారు. తప్పులు వస్తాయేమోనని భయపడేదని చెప్పారు. అందుకే తెలుగు, మలయాళం రెండూ తెలిసిన ఓ అసిస్టెంట్‌ను ఆమెతో ఉంచి, ప్రతి విషయాన్ని రెండు భాషల్లో వివరించేలా చేశానన్నారు. నక్షత్ర చిన్నచిన్నగా తెలుగు నేర్చుకుని, ఆ తర్వాత సులభంగా డైలాగ్స్ చెప్పడం ప్రారంభించిందని అన్నారు. అయితే కామెడీ సీన్లు, పాటలు చేస్తున్న సమయంలో ఒకరోజు అకస్మాత్తుగా ఎమోషనల్ సీన్ వచ్చిందని వెల్లడించారు. అది తండ్రికి సంబంధించిన చాలా ఎమోషనల్ సీన్ అని వివరించారు. ఆ సీన్లో నక్షత్రకు కొన్ని సూచనలు ఇచ్చి.. “మీ ఫాదర్‌ను ఊహించుకుని చేయి” అని చెప్పానన్నారు. దానికి నక్షత్ర “నాకు తండ్రి లేరు” అని చెప్పిందని వెల్లడించారు. అప్పటికే నక్షత్ర రెండు, మూడు ఎమోషనల్ సీన్లు చేసిందని శివ నిర్వాణ గుర్తు చేసుకున్నారు. తాను మరింత ఎమోషనల్‌గా అయితే నక్షత్రకు తండ్రి గుర్తొచ్చి మరింత బాధపడుతుందని భావించి.. “పర్లేదు, సిచువేషన్ను ఇమాజిన్ చేసి నీకు ఎంత ఎమోషన్ తీసుకురాగలవో అంత తీసుకురా” అని చెప్పినట్లు వెల్లడించారు. సినిమా క్లైమాక్స్‌లో నక్షత్ర అద్భుతంగా నటించిందని శివ తెలిపారు. సినిమా చివరి 20 నిమిషాల్లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు తెలుసని, ఆ సన్నివేశాలన్నింటినీ ఇలాంటి చిన్న అమ్మాయే చేసిందని చెప్పారు. దర్శకుడిగా తాను “శివ సార్ బాగా చేయండి.. మరో టేక్ తీసుకోండి.. డోంట్ కాంప్రమైజ్” అని చెప్పే స్థాయిలో నక్షత్ర ఎమోషనల్ సీన్లలో కన్విక్షన్, పవర్ చూపించిందని ప్రశంసించారు.
Also Read
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
- Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
- FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
- Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
“ఆ కన్విక్షన్, ఆ పవర్‌కి కారణం ఈ పిల్ల. ఆ పిల్లను పెంచిన ఆ పులి ఆమె తల్లి” అంటూ నక్షత్ర తల్లిని కూడా దర్శకుడు కొనియాడారు. నక్షత్ర నాలుగు సినిమాల్లో పలు క్యారెక్టర్లు చేస్తోందని చెప్పిన డైరెక్టర్.. ఆమె మదర్ ఈ సినిమా షూటింగ్‌కి వచ్చి తనతో మాట్లాడే విధానాన్ని కూడా వివరించారు. “సర్.. మై డాటర్ ఈజ్ యువర్స్. మీకు సీన్ బాగా వచ్చే వరకు చేసుకోండి” అని చెప్పేవారని తెలిపారు. అయితే షూటింగ్ సెట్లోకి వచ్చి తమ కుమార్తెను ఎలా చూసుకుంటున్నారో కూడా ఆయన ఎప్పుడూ అడగలేదన్నారు. “మా మమ్మీ ఎక్కడ ఉంది?” అని షూటింగ్లో ఒక్కరోజు కూడా నక్షత్ర అడగలేదని శివ చెప్పారు. తన అసిస్టెంట్లను కూడా పాపకు ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటూ ఆమె మదర్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. “పాపను నీటిలో తడపకండి, ట్యాంక్‌లో వేయకండి” వంటి సూచనలు కూడా వారు ఎప్పుడూ ఇవ్వలేదని అన్నారు. “నిజంగా పెంచడం అంటే ఇదే. బ్రాట్ అప్ అంటే ఇదే” అంటూ నక్షత్ర మదర్ పెంపకాన్ని శివనిర్వాణ ప్రశంసించారు. నక్షత్ర గురించి తాను నిజంగా గర్వపడుతున్నానని, ‘ఇరుముడి’కి ఆమె అందించిన కాంట్రిబ్యూషన్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. అదే సమయంలో నక్షత్ర మామయ్య గురించి కూడా శివ ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్నపిల్ల సెట్లో నటిస్తున్నప్పుడు ఆమె కంఫర్ట్ గురించి తల్లిదండ్రులు సాధారణంగా చాలా ప్రశ్నలు అడుగుతారని, కానీ నక్షత్ర కుటుంబం మాత్రం అలాంటి ప్రశ్నలు ఏమీ అడగలేదన్నారు. నక్షత్రను “వండర్ఫుల్ ఆర్టిస్ట్”గా దర్శకుడు కొనియాడారు. ప్రస్తుతం ఆ చిన్నారికి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!