Baahubali: The Epic: బాహుబలి రీ రిలీజ్ ప్రీమియర్.. జనం ఇంత కాళీగా ఉన్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ 31వ తేదీన ‘బాహుబలి: ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్నారు. నిజానికి ఈ మధ్యకాలంలో రీ-రిలీజ్ సినిమాలతో పోలిస్తే, ఈ సినిమా బుకింగ్స్ ఒక రేంజ్లో అవుతున్నాయి. అయితే ఈ ట్రెండ్‌ను బట్టి పరిశీలిస్తే రెండు విషయాలు అవగతం అవుతున్నాయి. అందులో ఒకటి, రీ-రిలీజ్ సినిమాలు కూడా చూసి ఎంజాయ్ చేసేంత ఖాళీగా జనాలు ఉన్నారా అనేది ఒకటైతే, కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా లేని క్రేజ్ ఈ సినిమాకి ఉందనేది మరొకటి.
Also Read : Prabhas: ప్రభాస్ అంటే సీక్వెల్ పక్కా.. కానీ అయ్యే పనేనా?
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
వాస్తవానికి రాజమౌళి మేకింగ్‌పై అందరికీ నమ్మకం ఉంది. ఇప్పటికే బాహుబలి సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి హిట్ అయింది. ఈ రెండు సినిమాలను కలిపి, కొన్ని పాత డిలీటెడ్ సీన్స్‌ను యాడ్ చేసి, కొంత నిడివి తగ్గించి, మూడు గంటల 45 నిమిషాల నిడివితో సినిమా రిలీజ్ చేస్తున్నారంటే దాదాపుగా చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్‌ను బట్టి టికెట్లు బుక్ చేసుకుని వెళుతున్నారా అంటే, అదీ లేదు.
Also Read : Mass Jathara: ఆ విషయంలో చరిత్ర సృష్టించిన ‘మాస్ జాతర’
ముందుగానే రీ-రిలీజ్ సినిమా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక రీ-రిలీజ్ సినిమాకి ప్రీమియర్స్ వేయడం ఒక ఎత్తు అయితే, ఆ ప్రీమియర్స్ టికెట్లు కూడా హాట్ కేక్స్లా అమ్ముడు పోవడం మరో ఎత్తు.
ఇక్కడ రాజమౌళి స్టామినా బయటపడుతోంది. అదేవిధంగా జనాలు ఎంత ఖాళీగా ఉన్నారో కూడా అర్థమవుతోంది. అంతేకాక, కంటెంట్ బావుంది అనుకుంటే, చూసిన సినిమాని మళ్లీ మళ్లీ చూడడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదనేది స్పష్టం అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఫిల్మ్ మేకర్స్ కూడా కంటెంట్ మీద ఫోకస్ పెడితే మంచిదేమో అనిపిస్తుంది.
తాజావార్తలు
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
IND-W vs ZIM-W: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్.!
-
PM Modi: ‘దేశమే ప్రథమం’.. దేశ శత్రువులను గుర్తించి ఓడించాలి.. విజయదశమి వేళ ప్రధాని మోదీ పిలుపు.!
-
MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!