NTV Telugu Site icon

Kichcha Sudeep: బిల్లా రంగా బాషా గా కిచ్చా సుదీప్.. కాన్సెప్ట్ వీడియో అదుర్స్..

Untitled Design (18)

Untitled Design (18)

కన్నడ సూపర్ స్టార్ బాద్‌షా కిచ్చా సుదీప్, దర్శకుడు అనూప్ భండారితో మరోసారి చేతులు కలిపారు, గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘విక్రాంత్ రోనా’ సూపర్ హిట్ సాధించింది.ఇప్పుడు వీరిరువురు కలిసి బిల్లా రంగా బాషా(BRB)  గా రాబోతున్నారు. హనుమాన్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Also Read: Jr.NTR : కేశవనాథేశ్వరనాలయంలో జూ. ఎన్టీయార్.. వీడియో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి

కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా 2209 A.D లో జరిగే కథను పరిచయం చేసే కాన్సెప్ట్ వీడియోతో పాటు ‘బిల్లా రంగ బాషా’ యొక్క ‘అఫీషియల్ లోగో’ని మేకర్స్ రిలీజ్ చేసారు. కాన్సెప్ట్ వీడిలో క్రీ.శ. 2209లో జరిగిన భవిష్యత్తు గురించిన ఒక సంగ్రహావలోకనం, ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ మరియు తాజ్ మహల్ అన్నీ ధ్వంసమయ్యాయి మరియు ఒక వ్యక్తి అన్నింటినీ జయించినట్లు కనిపిస్తోంది. దీనికి మూడు వేర్వేరు ప్రాంతాలు మరియు జాతులు, వాతావరణాన్ని చూపించాడు దర్శకుడు. కథలోని థీమ్ ఆడియెన్స్ కు అర్ధం అయ్యాలా రూపొందించాడు దర్శకుడు అనూప్ భండారి. ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “కిచ్చా సుదీప్‌తో అనూప్‌ భండారి జోడీ కడుతున్నారని మొదట విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం. విక్రాంత్ రోనా తెలుగులో విజయవంతమైంది. బిల్లా రంగ బాష కథ విన్నప్పుడు, ఇది మేమే నిర్మించాలి అనే నమ్మకం కలిగింది. సూపర్‌స్టార్‌ కిచ్చా సుదీప్‌తో జతకట్టడం అనేది ఎప్పుడూ గొప్ప అవకాశం. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది,బిల్లా రంగ బాష ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు ఎదురుచూస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈచిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషలలో నిర్మింస్తునన్నాం” అని అన్నారు.

Show comments