Atadu4k : ‘అతడు’ రీరిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడు
సూపర్ స్టార్ మహేశ్ సినిమాలలో ‘అతడు’ సినిమాకు ఉండే క్రేజ్ వేరు. త్రివిక్రమ్ దర్శకత్వంలో 2005 లో వచ్చిన ఈ సినిమాలో పార్థుగా మహేశ్ సెటిల్డ్ ప్ఫరామెన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. మహేశ్ స్టైల్ పంచ్ లు, బ్రహ్మీ కామెడీ, త్రివిక్రమ్ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే బుల్లి తెరపై అత్యధిక సార్లు ప్రసారం అయిన సినిమాగా అతడు పేరిట రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అతడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు.
Also Read : Tollywood : లిక్కర్ స్కాం నిందితుడు వెంకటేష్ నాయుడుతో స్పెషల్ జెట్ లో తమన్నా..
Also Read
టాలీవుడ్ లో రీరిలీజ్ సినిమాల ట్రెండ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పోకిరితో మొదలైంది. ఒక్కడు, మురారి, ఖలేజా రీరిలీజ్ లో భారీ వసూళ్లు రాబట్టాయి. అందులో భాగంగానే సూపర్ స్టార్ మహేశ్ బాబు 50వ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న ‘అతడు’ 4K క్వాలిటీలో వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ కానుంది. అందుకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇన్నేళ్ల తర్వాత కూడా అతడు క్రేజే ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అతడు బుకింగ్స్ రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాల కంటే బాగున్నాయంటే అతడు ట్రెండ్ ఎలా ఉందనేది అర్ధం చేసుకోవచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అతడు బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఘట్టమనేని అభిమానులతో పాటు ప్రేక్షుకులు కూడా ఈ సినిమాను 70MM స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తున్నారు. నైజాంలో ఈ సినిమాను ఏషియన్ విడుదల చేస్తుండగా ఏపీలో ఏరియాల వారీగా పోటీ పడి మరి భారీ ధరకు అతడు రీరీరిలీజ్ హక్కులు కొనుగులు చేసారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా రీరిలీజ్ థియేట్రికల్ రైట్స్ హక్కులు రికార్డ్ స్థాయిలో 3 కోట్లకు పైగా ధర పలికినట్టు సమాచారం. ఒక వైపు బాబు బర్త్ డే మరోవైపు వీకెండ్, సినిమాలు ఏవి లేకపోవడం అతడు రీరిలీజ్ లో రికార్డు స్థాయి నంబర్స్ రాబట్టే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
-
Nature Health Study: మీ ఇంటి పక్కనే పొలం ఉందా? అయితే మీకు క్యాన్సర్లు వచ్చే ముప్పు 150% ఉందట..
-
Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
-
IPL Teams Profits: ట్రోఫీ గెలవకపోయినా లాభాలే లాభాలు.. ఐపీఎల్ టీమ్స్ అసలు బిజినెస్ ఇదే, లెక్కలు తెలిస్తే మైండ్ బ్లాకే!
-
Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో