Danny : నవంబర్ 13న రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామా ‘డానీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక మనిషికి బాగా అతుక్కుపోయిన పాత అలవాట్లు, వ్యసనాలు.. అతని జీవితంలోకి కొత్తగా వచ్చిన స్వచ్ఛమైన ప్రేమను ఢీకొడితే ఆ పోరాటం ఎలా ఉంటుంది? ఆ రెండు విరుద్ధ భావాల మధ్య జరిగే భయంకరమైన సంఘర్షణను తెరపై అత్యంత బోల్డ్‌గా ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘డానీ’. టాలీవుడ్లో ‘నాటకం’ సినిమాతో రా అండ్ రస్టిక్ ఫీల్‌ను పరిచయం చేసిన ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై భారీ నిర్మాణ విలువలతో రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ ‘డానీ’ చిత్రం నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ మేరకు మేకర్స్ వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ఇంటెన్స్, బోల్డ్‌నెస్‌ను ప్రతిబింబించేలా ఉన్న ఆ పోస్టర్.. సినిమా ఎంత రియలిస్టిక్ క్రైమ్ డ్రామాగా ఉండబోతోందోకళ్లకు కడుతోంది.
సాధారణ రొమాంటిక్ డ్రామాలకు భిన్నంగా ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ ఒక సరికొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఉన్న కొన్ని మొండి అలవాట్లు అతని జీవితాన్ని ఎలాంటి అంధకారంలోకి నెట్టేశాయి? ఆ చీకటి రోజుల్లోకి ప్రేమ ప్రవేశించిన తర్వాత అతని వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ప్రేమ కోసం పాత జీవితాన్ని వదులుకున్నాడా? లేక పాత అలవాట్లు ప్రేమను బలితీసుకున్నాయా? అనే ఆసక్తికరమైన క్రైమ్ నేపథ్యంతో ఈ కథ నడవనుంది. ప్రేమకు, అలవాటుకు మధ్య జరిగే ఈ మానసిక పోరాటాన్ని తెరపై పచ్చిగా చూపించబోతున్నారు. గతంలో ఆశిష్ గాంధీ, కళ్యాణ్‌జీ కాంబినేషన్లో వచ్చిన ‘నాటకం’ మూవీ మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే ఎనర్జీతో వస్తున్న ‘డానీ’లో ఆశిష్ గాంధీకి జోడీగా సేజల్ గుప్తా నటిస్తుండగా.. సోనాల్ సింగ్, అజర్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
ఇలాంటి ఇంటెన్స్ క్రైమ్ డ్రామాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రాణం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అందించిన బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమాగా చెబుతోంది. ఏకే ఆనంద్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరింత రస్టిక్‌గా మార్చగా, మణికాంత్ తన ఎడిటింగ్‌తో సినిమాకు పరుగులు పెట్టించనున్నారు. ఖుషి, సుధాకర్ గోడ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ఇంటెన్స్ రొమాంటిక్ క్రైమ్ డ్రామా.. నవంబర్ 13న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
తాజావార్తలు
-
Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
-
AP Municipal Elections 2026: బెజవాడలో కూటమి పార్టీల మధ్య సీట్ల చిచ్చు.. జనసేన, బీజేపీ డిమాండ్లతో ఉత్కంఠ
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్‌తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!