NTV Telugu Site icon

SDT18 : సుప్రీం హీరో సరసన తమిళ భామ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్

Untitled Design (16)

Untitled Design (16)

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ్ తేజ్ సరికొత్త కథాంశంతో కమర్షియల్ ఎబిలిటీతో బలమైన కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ‘విరూపాక్ష’ మరియు ‘బ్రో’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరో సినిమా స్టార్ట్ చెసాడు ఈ హీరో.రోహిత్ కెపి అనే నూతన దర్శకుడిని పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు మరియు కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్ వంటి సంచలనాత్మక పాన్ ఇండియా విజయం తర్వాత, నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లోదాదాపు రూ. 75 కోట్ల బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు .

Also Read : Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..

ఈ చిత్రంలో హీరోతో పాటు హీరోయిన్ కి ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. అనులో భాగంగా అనేక మంది పేర్లు వినిపించాయి. ఫైనల్ గా ఈ చిత్రంలో సాయి దుర్ఘ తేజ్ సరసన నటించడానికి తమిళ భామ ఐశ్వర్య లక్ష్మిని ఎంపిక చేసారు మేకర్స్. ఈ సినిమాలో వసంత అనే క్యారెక్టర్ లో ఐశ్వర్య కనిపించనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఎడారి లాంటి ల్యాండ్‌స్కేప్‌లో సెట్ చేసిన పోస్టర్‌లో ఐశ్వర్య ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ హై-ఆక్టేన్, పీరియడ్-యాక్షన్ డ్రామాలో సాయి దుర్ఘా తేజ్ సరికొత్తగా మునుపెన్నడూ చేయని రోల్ లో కనిపించనున్నాడు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం పాన్-ఇండియా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాతలు.

Show comments