Site icon NTV Telugu

Arya 3: దిల్ వారసుడి కోసం ‘ఆర్య 3’ రెడీ

Game Changer Sukumar Review

Game Changer Sukumar Review

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ఆర్య సిరీస్‌కు మరో అధ్యాయం సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్య 3” టైటిల్‌ను రిజిస్టర్ చేసిన విషయం ఇటీవల వార్తల్లో నిలిచింది. 2004లో విడుదలైన ఆర్య చిత్రం అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజు కెరీర్‌లలో మైలురాయిగా నిలిచిన సినిమా. ఈ చిత్రం తెలుగు సినిమాలో ప్రేమకథలను ఒక కొత్త రీతిలో ఆవిష్కరించి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 2009లో వచ్చిన ఆర్య 2 అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ, అల్లు అర్జున్ అభిమానుల మనసు గెలుచుకుంది.

Also Read:Kingdom: అబ్బే.. మళ్ళీ షూట్ చేయాల్సిందే!

ఇప్పుడు, ఆర్య 3 టైటిల్ రిజిస్ట్రేషన్‌తో ఈ ఫ్రాంచైజీ మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ దర్శకుడు అట్లీతో AA22, త్రివిక్రమ్‌తో ఒక పౌరాణిక చిత్రం, సుకుమార్‌తో పుష్ప 3 వంటి ప్రాజెక్టులతో రాబోయే 2-3 సంవత్సరాలు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆర్య 3లో అల్లు అర్జున్ బదులు దిల్ రాజు సోదరుడు శిరీష్ వారసుడైన ఆశిష్ రెడ్డి హీరోగా నటించనున్నట్లు సమాచారం. ఆశిష్ రెడ్డి ఇప్పటికే రౌడీ బాయ్స్ (2022), లవ్ మీ వంటి చిత్రాలతో తన సత్తా చాటాడు.

Also Read:Rakul: రకుల్‌ ప్రీత్‌కి హైదరాబాద్‌లో ఇల్లు గిఫ్ట్.. ఫైనల్లీ ఓపెనయ్యిందిగా!

ప్రస్తుతం ఆయన దేత్తడి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆర్య 3కి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ, సహ-నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించడం లేదు. సుకుమార్ పర్యవేక్షణలో తన సహాయ దర్శకుడు ఒకరు ఈ సినిమాతో దర్శకుడిగా మారే అవకాశం ఉంది. ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మితం కానుంది. ఆర్య 3 త్వరలో పట్టాలెక్కనుందని, ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కోసం దిల్ రాజు, శిరీష్, సుకుమార్ టీమ్ రంగం సిద్ధం చేస్తోంది.

Exit mobile version