అర్జున్ కపూర్ కెరీర్ గ్రాఫ్ డౌన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్. గత తొమ్మిదేళ్ళలో చేసినవి కొన్ని చిత్రాలే అయినా అతని కంటూ ఓ గుర్తింపు ఉంది. అయితే కొంతకాలంగా అర్జున్ కపూర్ వ్యక్తిగత జీవితం… అతని ప్రొఫెషన్ కంటే కూడా ఎక్కువగా వార్తలలో నానుతోంది. దానికి తోడు ఈ పేండమిక్ సిట్యుయేషన్ లో అర్జున్ నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోది సైతం ఓటీటీకే పరిమితం కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్జున్ కపూర్ మార్కెట్ కు బాగా దెబ్బపడే ఛాన్స్ ఉందని, అదే సమయంలో అతని కెరీర్ గ్రాఫ్ కిందకు పడిపోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అర్జున్ కపూర్, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన సందీప్ అండ్ పింకీ ఫరార్ చిత్రం మార్చి 19న ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా, మే 18న మరో సినిమా సర్దార్ కా గ్రాండ్ సన్ విడుదలైంది. ఈ రెండు పెద్దంత ఆదరణకు నోచుకోలేదు. ఇప్పుడు మూడో సినిమా కూడా అదే జాబితాలో చేరబోతోందట. అర్జున్ కపూర్ నటిస్తున్న భూత్ పోలీస్ సైతం జులైలో ఓటీటీలో విడుదల అవుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇది కాకుండా అర్జున్ కపూర్ ఏక్ విలన్ రిటర్న్స్‌లో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. మరి ఆ సినిమా అయినా థియేట్రికల్ రిలీజ్ అయ్యి, అర్జున్ కపూర్ కెరీర్ గ్రాఫ్ ను పైకి తీసుకెళుతుందేమో చూడాలి.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
PM Modi Paper Leak Law: పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్‌చుక్
-
Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?