NTV Telugu Site icon

Ari Movie : విడుదలకు ముందే సినిమా చూపిస్తున్నారు!

Ari Movie

Ari Movie

పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జయ శంకర్ దర్శకుడిగా అరి అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో టీం బిజీగా ఉంది. సైకో మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అరి మూవీని ప్రత్యేకంగా కొంత మంది కోసం ప్రదర్శించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలు ఈ మూవీని వీక్షించి ప్రశంసలు కురిపించి భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారని అన్నారు. అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటివారు నటించిన ఈ సినిమా అరిషడ్వర్గాలమీ ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. రిలీజ్ కు ముందే అరి మూవీని ప్రస్తుతం వీక్షించేందుకు కొంత మందికి అవకాశాన్ని కల్పిస్తోంది సినిమా యూనిట్.

BoycottLaila: ‘లైలా’కి బాయ్ కాట్ టెన్షన్.. కొంప ముంచిన పృథ్వి!

మైథలాజికల్ థ్రిల్లర్ జానర్ల‌ను ఇష్ట పడే ఆడియెన్స్‌కు ఈ చిత్రం మరింతగా నచ్చేలా ఉంటుంది. సినీ లవర్స్ అంతా కూడా ముందుగానే అరి మూవీని చూసే అవకాశాన్ని చిత్రయూనిట్ కల్పిస్తోంది. ఇలా విడుదలకు ముందే సినిమాను చూపించే ధైర్యాన్ని ఎవ్వరూ చేయరు కానీ అరి మీదున్న నమ్మకం దర్శకుడు జయశంకర్ ఇలా ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేశారు. విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించాలనుకునే వారు వివరాల్ని తెలియజేయండి అంటూ వాట్సప్ నంబర్‌ను కూడా డైరెక్టర్ జోడించారు. ఇక జయ శంకర్ మూడో ప్రాజెక్ట్ కూడా కన్ఫామ్ అయింది. ఇంటెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటిచంనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నారు.