ఒక్కప్పుడు ప్రేక్షకాభిమానులు హీరో, హీరోయిన్స్ ని కలవాలి, మాట్లాడాలి అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. సినిమాలో చూడటం తప్పించి నేరుగా వారిని చూడటం చాలా తక్కువ. ఇప్పుడు రోజులు మారిపోయాయి సోషల్ మీడియా వచ్చిన తర్వాత హీరో, హీరోయిన్‌లతో అభిమానులు నేరుగా ముచ్చటిస్తున్నారు. కానీ ఒక్కోసారి ఆ మాటలు సెలబ్రెలకు తలనొప్పిగా కూడా మారుతాయి. ఎందుకంటే నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తారు నోటికొచ్చింది అడిగేస్తారు. ఇలాంటి టైంలో నటినటులు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా హీరోయిన్‌లకు ఈ సోషల్ మీడియా ఓ వేదికే కాదు, పలు సందర్భాల్లో వారికి ఇబ్బందికరమైన అనుభవాలకూ కూడా కారణమవుతుంది.
Also Read : Sudheer Babu : చిక్కుల్లో పడిన ‘జటాధర’..?
సినిమాల్లో ఎంత బోల్డ్‌గా కనిపించినా, వ్యక్తిగతంగా కొన్ని హద్దులు ఉండాలని భావించే హీరోయిన్ల కూడా ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ మాళవిక మోహనన్ ఒక్కరు. తమిళం నుంచి బాలీవుడ్ వరకు తన అందంతో, నటనతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కెరీర్ పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ మాళవిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది మళవిక. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఆమె ఓ ట్విట్టర్ సెషన్‌లో ముచ్చటించగా అందులో ఫ్యాన్స్ కొన్ని సాధారణ ప్రశ్నలు అడిగితే, మరికొంతమంది మాత్రం హద్దులు మీరేలా ప్రశ్నలు అడిగారు. ఓ నెటిజన్ తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే, ఇంతలోనే మరో నెటిజన్ మరింత దారుణం.. ‘మీరు వర్జినా?’ అంటూ ప్రశ్నించాడు. ఇది చూసి మాళవిక షాక్ అయ్యింది. ‘ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. చెత్త ప్రవర్తన మానేయండి’ అంటూ తిప్పికొట్టింది.