ఆన్ టైంలో మ్యూజిక్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ పదికాలాల పాటు గుర్తుండిపోయే సాంగ్స్ అందిస్తుంటారు ఏఆర్ రెహమాన్. అయితే ఈ మధ్య కొన్ని సినిమాలతో డిజప్పాయింట్ చేసిన స్టార్ కంపోజర్.. తను గట్టిగా మనసు పెట్టాలే కానీ సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని మరోసారి ఫ్రూవ్ చేశారు ఏఆర్ రెహమాన్. రీసెంట్లీ ఆయన కంపోజింగ్ చేసిన రెండు సినిమాల్లోని టూ సాంగ్స్ ఆడియన్స్‌కు బాగా రీచ్ అయ్యాయి. అంతే కాదు తక్కువ టైంలోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకున్నాయి.
Also Read : Jr NTR : ఎన్టీఆర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. దేవర 2 ఇప్పట్లో లేనట్టే?
ధనుష్- ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో తెరకెక్కుతోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ తేరీ ఇష్క్ మే. కృతిసనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు ఏఆర్ రెహమాన్. ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా జస్ట్ త్రీ వీక్స్ లోనే 100 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసిన ఏ సాంగ్ ఇన్ని వ్యూస్ రాబట్టుకోలేదు. ఈ సినిమాను తెలుగులో అమర కావ్యంగా తెస్తున్నారు మేకర్స్. గతంలో ధనుష్ నటించిన రంఝానా, మారియన్, రాయన్ చిత్రాలకు కంపోజర్‌గా వ్యహరించారు రెహమాన్. అయితే చెప్పిన టైమ్ కు మ్యూజిక్ వర్క్ ఫినిష్ చేయడని రెహమాన్‌పై గట్టి రూమర్స్ ఉన్నాయి. అందుకే టాలీవుడ్ స్టార్ మేకర్స్ త్వరగా ఈ మ్యూజిషియన్ జోలికి తర్వగా పోరు. కానీ ఈసారి బుచ్చిబాబు సాహసమే చేశాడు. సాంగ్స్, ట్యూన్స్ విషయంలో బుచ్చి టెన్షన్‌ను.. ఒక్కసాంగ్‌తో కూల్ చేసేశాడు స్టార్ కంపోజర్. చికిరి సాంగ్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. దేశ సరిహద్దులు దాటేసి ఖండాంతరాలకు పాకిపోయింది. ఎక్కడ చూసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ మేనియాతోనే ఊగిపోతున్నాడు మూవీ లవర్స్. సాంగ్ రిలీజై టూ వీక్స్ దాటినా కూడా టాప్ 5లోనే కంటిన్యూ అవుతోంది. ఈ సింగిల్.. అన్ని భాషల్లో 100 మిలియన్స్ క్రాస్ చేసి చార్ట్ బస్టర్‌గా మారింది. ఇక చేతి నిండా సినిమాలున్నా కూడా.. వరుసగా కాన్సర్ట్స్ నిర్వహిస్తూ మరింత బిజీగా మారారు రెహమాన్.
