స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఘాటి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా శరవేగంగా జరుపుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రం తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.
Also Read : Tollywood Box Office : 2004 సంక్రాంతి క్లాష్ 2026లో రిపీట్ అవుతుందా?
కాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలో శీలవతి పాత్రలో అనుష్క స్టన్నింగ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ చిత్ర రన్‌టైమ్‌ను 2 గంటల 37 నిమిషాలకు లాక్ చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్ర యూనిట్ వెల్లడించింది. అంతే కాదు సెన్సార్ కమిటీ సభ్యులు ఈ సినిమాపై పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా, సినిమాలో ఉన్న 7–8 పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ చాలా బలంగా వర్కౌట్ అయ్యాయని సమాచారం. అంతేకాదు, ఈ సినిమా కథ ఎమోషనల్ జర్నీగా ప్రారంభమై, ఇంటర్వెల్ వరకు సున్నితంగా నడిచినప్పటికి, ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఆడియన్స్‌ను పూర్తిగా షాక్‌కు గురిచేయడం ఖాయం అంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత కథ ఒక్కసారిగా అతి తీవ్ర యాక్షన్ మోడ్ లోకి వెళ్లి, గంజాయి మాఫియా నేపథ్యం పై రగిలే కథతో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టనుందట. కోట్లాది అభిమానులను సంపాదించుకున్న అనుష్క పెద్దగా సినిమాలు చేయకపోవడంతో, ఆమె అభిమానులు కొత్త సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఆ వెయిటింగ్‌కి ఎండ్ కార్డ్ పడినట్లే.