NTV Telugu Site icon

లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…!

Anupama Parameshwaran Comments about her Love and Break Up

“ప్రేమమ్” బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని ఈ చిన్నది తాజాగా లవ్ మేటర్ పై స్పందించింది. ఇటీవల అనుపమ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యింది. అందులో భాగంగా ఆమె ఫాలోవర్స్ లో ఒకరు “మీరు నిజమైన ప్రేమను ఫీల్ అయ్యారా ?” అని అడిగారు.

Read Also : “బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్

ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ అనుపమ “అవును నేను నిజమైన ప్రేమ, అలాగే నిజమైన బ్రేకప్ కూడా చూసేశాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ జవాబుతో ఆమె ఇంతముందు ప్రేమలో ఉన్నానని, ఇప్పుడు విడిపోయానని చెప్పకనే చెప్పింది. కానీ ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచింది. ఈ చాట్ సెషన్‌లో అనుపమ తన రాబోయే తెలుగు ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఆమె నిఖిల్ ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’, హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తదుపరి చిత్రం ‘రౌడీ బాయ్స్’, ‘హెలెన్’ తెలుగు రీమేక్ లలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు కోలీవుడ్‌లో ఆమె నటించిన “నిన్ను కోరి” తమిళ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అనుపమ తెలిపారు.