లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ప్రేమమ్” బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని ఈ చిన్నది తాజాగా లవ్ మేటర్ పై స్పందించింది. ఇటీవల అనుపమ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యింది. అందులో భాగంగా ఆమె ఫాలోవర్స్ లో ఒకరు “మీరు నిజమైన ప్రేమను ఫీల్ అయ్యారా ?” అని అడిగారు.
Read Also : “బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్
Also Read
ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ అనుపమ “అవును నేను నిజమైన ప్రేమ, అలాగే నిజమైన బ్రేకప్ కూడా చూసేశాను” అంటూ చెప్పుకొచ్చింది. ఈ జవాబుతో ఆమె ఇంతముందు ప్రేమలో ఉన్నానని, ఇప్పుడు విడిపోయానని చెప్పకనే చెప్పింది. కానీ ఆ వ్యక్తి ఎవరన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ లో ఉంచింది. ఈ చాట్ సెషన్లో అనుపమ తన రాబోయే తెలుగు ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఆమె నిఖిల్ ’18 పేజెస్’, ‘కార్తికేయ 2’, హుషారు దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తదుపరి చిత్రం ‘రౌడీ బాయ్స్’, ‘హెలెన్’ తెలుగు రీమేక్ లలో నటిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు కోలీవుడ్‌లో ఆమె నటించిన “నిన్ను కోరి” తమిళ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయని అనుపమ తెలిపారు.
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి