“బాహుబలి”కి ఆరేళ్ళు… పిక్ షేర్ చేసిన ప్రభాస్

దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “బాహుబలి : ది బిగినింగ్” విడుదలై ఆరు సంవత్సరాలయింది. గత ఆరు సంవత్సరాల క్రితం ఇదే రోజున అంటే 2015 జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకూ టాలీవుడ్ కు ఉన్న పరిమితులన్నీ తెంచేసి, ఇక్కడ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో సినిమా తెరకెక్కించగల సమర్థులు ఉన్నారన్న విషయాన్ని ప్రపంచానికి చాటింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ‘బాహుబలి’ మేనియా ఊపేసింది. ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని దేశవ్యాప్తంగా చర్చించదగిన విషయాన్ని చేశాడు రాజమౌళి.

Read Also : కరీనా, సైఫ్ దంపతుల రెండవ కొడుకు పేరేంటో తెలుసా ?

ఇక ప్రభాస్‌తో పాటు ఈ ఎపిక్ ఫాంటసీలో రానా దగ్గుబాటి, తమన్నా, అనుష్క శెట్టి, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్ తదితరులు నటించారు. వీరందరూ కలిసి తెరపై సృష్టించిన మ్యాజిక్కు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. ఈ చిత్రం విడుదలై 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ శనివారం తన సోషల్ మీడియాలో ‘బాహుబలి’కి సంబంధించిన ఓ పిక్ ను షేర్ చేశారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ తెలుగు, తమిళ భాషలలో చిత్రీకరించబడింది. మలయాళం, హిందీలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంతోనే ప్రభాస్ భారీ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఈ మూవీ సృష్టించిన అద్భుతం అనంతరం టాలీవుడ్ పరిస్థితి ‘బాహుబలి’ ముందు, తరువాత అన్నంతగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’, ‘సలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-