కేరళ కుట్టీ అనుపరమ పరమేశ్వరన్ కెరీర్ స్టార్టింగ్ నుండి పక్కింటి అమ్మాయి క్యారెక్టర్లే చేసింది. కానీ అది వన్స్ అప్ ఆన్ ఎ టైం. టైర్ 3 హీరోలతోనో లేక న్యూ యాక్టర్లతో నటించి అమ్మడు ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంది. మడి కట్టుకుని కూర్చొంటే ఆఫర్స్ రావని కళ్లు తెరిచిన భామ టిల్లు స్క్వేర్‌తో గ్లామర్ గేట్స్ ఓపెన్ చేసింది. ఫ్యాన్స్ హర్ట్ అయినా కర్లింగ్ హెయిర్ భామకు ఛాన్సులు ఓవర్ ఫ్లో అయ్యాయి. ఆరు క్రేజీ ప్రాజెక్టులతో కొత్త సినిమాకు డేట్స్ లేనంత బిజీగా మేకోవర్ అయ్యింది.
Also Read : Jailer : జపాన్‌లో రిలీజ్ కాబోతున్న జైలర్
టిల్వు స్క్వేర్ తర్వాత అనూ లైనప్స్ వేరు. అంతకు ముందు వేరు అనేలా మారింది అను కెరీర్. అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ఆపై మాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేసేస్తోంది. ఇప్పటికే జూనియర్ ధనుష్ ప్రదీప్ రంగనాథ్ సరసన డ్రాగన్ కంప్లీట్ చేసింది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది మూవీ. ఇదే కాకుండా ధ్రువ్ విక్రమ్‌తో బిసన్, జెఎస్కే ట్రూత్ షల్ అల్వేస్ ప్రీవేల్, పెట్ డిటెక్టివ్, లాక్ డౌన్ సినిమాలు చేస్తుంది. ఇక తెలుగులో ఒక్కటంటే ఒక్క మూవీ చేస్తోంది. అదే పరదా రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే మలయాళ కుట్టీ బర్త్ డే సందర్బంగా ఓ వీడియోను వదిలారు. ప్రవీణన్ కండ్రెగుల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో సుబ్బు పాత్రలో కనిపిస్తోంది అను. డిఫరెంట్ సోషియో డ్రామాగా వస్తోన్న పరదాలో దర్శన రాజేంద్రన్, సంగీత కీ రోల్స్ చేస్తున్నారు. టిల్లు స్వ్కేర్ తో హిట్ ట్రాక్ ఎక్కిన మలయాళీ బ్యూటీ ఆ సక్సెస్ కంటిన్యూ చేయాలని ఆశిద్దాం.