Anupam Kher: విజయాన్ని వాయిదా వేయొచ్చు.. కానీ ఓటమిని కాదు.. బెంగాల్ గెలుపుపై అనుపమ్ ఖేర్ సెన్సేషనల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupam Kher: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించి, కమలం వికసించిన వేళ.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఏ రాజకీయ పార్టీ పేరు ఎత్తకుండానే ఆయన రాసిన కొన్ని వ్యాఖ్యలు నేరుగా బెంగాల్ ఫలితాలను ఉద్దేశించినవేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అనుపమ్ ఖేర్ పోస్ట్‌లో ఏముందంటే..
సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన కొద్దిసేపటికే అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. “సంకల్పం నిజమైతే, గమ్యం ఖాయం. విజయాన్ని వాయిదా వేయవచ్చు, కానీ దానిని ఓడించలేరు (ఓటమిని ఆపలేరు)” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుపమ్ ఖేర్ తన పోస్ట్‌లో ఎక్కడా బీజేపీ లేదా పశ్చిమ బెంగాల్ ప్రస్తావన తీసుకురాలేదు. అయినప్పటికీ, బెంగాల్‌లో దశాబ్దాల నిరీక్షణ తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం, తృణమూల్ కాంగ్రెస్ పతనం కావడాన్ని ఉద్దేశించే ఆయన ఈ మాటలు అన్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “మీరు బెంగాల్ ఎన్నికల ఫలితాల గురించే మాట్లాడుతున్నారని మాకు స్పష్టంగా అర్థమైంది” అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు “నిజమైన గెలుపుకు సమయం పట్టినా, అది రావడం ఖాయమని మీరు నిరూపించారు” అంటూ ఆయన పోస్ట్‌ను సమర్థిస్తున్నారు.
Also Read
- The Odyssey : 'ది ఒడిస్సీ'కి ఎందుకంత భయపడుతున్నారు?
- Karan Johar: చివరికి మలయాళ దర్శకుడిని నమ్ముకున్న కరణ్ జోహార్
- Natti Kumar: పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి
- Modi - Trump: ప్రపంచ దేశాల కళ్లు ఫ్రాన్స్‌పైనే.. జీ7 సదస్సులో చేతులు కలిపిన మోడీ - ట్రంప్! వాషింగ్టన్ టు ఢిల్లీ నయా జోష్..
నిర్మొహమాటానికి మారుపేరు..
అనుపమ్ ఖేర్ సామాజిక, రాజకీయ అంశాలపై మొదటి నుంచి చాలా నిర్మొహమాటంగా స్పందిస్తుంటారు. జాతీయవాదం, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు బెంగాల్ ఫలితాల వేళ ఆయన చేసిన ఈ ‘గూఢమైన’ పోస్ట్, పరోక్షంగా మమతా బెనర్జీ ఓటమిని, బీజేపీ విజయాన్ని సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కోల్‌కతా నుంచి ఢిల్లీ వరకు బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోగా, అనుపమ్ ఖేర్ పోస్ట్ ఆ సంబరాలకు మరింత ఊపునిచ్చినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
— Anupam Kher (@AnupamPKher) May 4, 2026
తాజావార్తలు
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?