Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ వైవిధ్యమైన, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జునకు చెందిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సరికొత్త వినూత్న చిత్రం ‘పళ్ళబురుసు’ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన క్రేజీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విడుదలైన ‘పళ్ళబురుసు’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని ఒక్కసారిగా పీక్స్‌కు తీసుకెళ్లింది. ఒక జిల్లా కోర్టు ఆవరణలో.. న్యాయదేవత చేతిలో ఉండే త్రాసులా కాకుండా, ఒక పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా డిజైన్ చేసి చూపించారు. ఆ బ్రష్‌పై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారుల లుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పక్కా తెలుగు సంస్కృతి, మన ప్రాంతీయతను ప్రతిబింబించేలా ఈ వినూత్న విజువల్ ను డిజైన్ చేశారు. టైటిల్, పోస్టర్ చూస్తుంటే ఇదొక సరికొత్త హిలేరియస్ పొలిటికల్ లేదా సోషల్ కామెడీ-డ్రామాగా రాబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ సినిమాలో వెర్సటైల్ నటులు సుధాకర్ రెడ్డి, ‘బలగం’ ఫేమ్ మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే కామెడీ ఎమోషన్స్ సినిమాకు మెయిన్ హైలైట్ కానున్నాయి. వీరితో పాటు ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్వతంత్ర దినోత్సవ కానుకగా 2026 ఆగస్టు 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్నారు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ పవన్ సీహెచ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తుండగా, వినోద్ కె. బంగారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, క్షితిజ్ జీవన్ రణధీర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.
Also Read
- Ranabaali Postpone : విజయ్ దేవరకొండ 'రణబాలి' పోస్ట్‌పోన్ అవుతుందా?
- Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
- Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'పవర్ హౌస్'గా విక్రమ్ 63..
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
UPI Charges: రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై.. ఛార్జీల విషయంలో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ
-
AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!