Abhimani: హీరోగా సురేష్ కొండేటి.. నాన్నమ్మగా అన్నపూర్ణమ్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ అనే పాత్రకు మొదట గుర్తు వచ్చేది అన్నపూర్ణమ్మ ..! టాలీవుడ్ లో ఎంత మంది అమ్మ పాత్రలు చేసినా సరే… అన్నపూర్ణమ్మ చేసిన అమ్మ పాత్రలు మాత్రం చిరస్థాయిలో నిలిచిపోతాయి అనేది వాస్తవ౦. టాలీవుడ్ లో అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అంటూ ఆమె చేసిన అమ్మ పాత్రలు టాలీవుడ్ జనానికి చూపించాయి. సీనియర్ ఎన్టీఆర్ మొదలు చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలకు ఆమె అమ్మగా నటించి మెప్పించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన ఎంతగానో ఆకట్టుకునేది. ముఖ్యంగా టాలీవుడ్ జనాలకు అన్నపూర్ణమ్మ అనగానే అమ్మ పాత్ర కళ్ళ ముందు ఉంటుంది. అంతకు ముందు ఎంత మంది వచ్చినా సరే ఆమె చేసిన పాత్రలకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అప్పట్లో దర్శకులు కూడా అన్నపూర్ణమ్మ కోసం అంటూ ప్రత్యేకంగా అమ్మ పాత్రను డిజైన్ చేసేవారు అంటే అతిశయోక్తి కాదు.
Also Read;OTT Movies : ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు.
Also Read
టాలీవుడ్ జనాలు కూడా ఆమెను ఆదరించారు. తమిళ సినిమాల్లో ఆమెకు ఎక్కువ అవకాశాలు వచ్చినా సరే తెలుగు సినిమాలకే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తన పాత్రకు న్యాయం చెయ్యాలి అనే తపనతో ఆమె నటించే వారు. తన పాత్రకు నటన ఎక్కువగా ఉంటేనే ఆమె సినిమాను అంగీకరించారు. దాదాపు 80 సినిమాల్లో ఆమె అమ్మ పాత్రలు చేసింది. ఇక ఇప్పుడు ఆమె నటుడిగా మారిన సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తున్నారు. సురేష్ కొండేటి అభిమాని అనే ఒక వెబ్ ఫిలిం చేస్తున్నారు. ఆ సినిమాలో ఆమె సురేష్ కొండేటికి నానమ్మ పాత్రలో నటిస్తున్నారు. బషీర్ అమ్మ ప్రొడక్షన్స్ లో వస్తున్న అభిమాని వెబ్ మూవీకి రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!