Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పటి నుంచే అనిరుధ్‌కు సంగీతంపై పిచ్చి ఉన్నప్పటికీ, చదువులో మాత్రం టాపర్. ముఖ్యంగా లెక్కల్లో పులి! దీంతో ఆయన తండ్రి రవి రాఘవేంద్ర తన కొడుకును ఐఐటీలో చదివించి పెద్ద స్థాయిలో చూడాలని కలలు కన్నారు. “నా కొడుకు ఐఐటీ మెటీరియల్” అని అందరి దగ్గరా గర్వంగా చెప్పుకునేవారు. లయోలా కాలేజీలో బీకామ్ పూర్తి చేశాక, పైచదువుల కోసం సింగపూర్ పంపాలని తల్లిదండ్రులు ఫిక్స్ అయ్యారు. సరిగ్గా అప్పుడే హీరో ధనుష్ ఎంట్రీ ఇచ్చారు. అనిరుధ్‌లో ఉన్న అద్భుతమైన టాలెంట్‌ను గుర్తించిన ధనుష్.. స్వయంగా ఆయన తల్లిదండ్రులతో మాట్లాడి వారి మనసు మార్చారు. “వీడు మ్యూజిక్ డైరెక్టర్ అయితే చాలా పెద్ద స్థాయికి వెళ్తాడు” అని ఒప్పించి, ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ‘3’ సినిమాకు చాన్స్ ఇప్పించారు. ఆ ఒక్క నిర్ణయం అనిరుధ్ జీవితాన్నే మార్చేసింది. అన్నట్టు ఈ ధనుష్ రజనీకాంత్ భార్య సోదరి కుమారుడే. దీంతో బంధువైన ధనుష్ అనిరుద్ కి పుష్ ఇచ్చాడన్న మాట.
మొదటి సినిమా ‘3’ చేస్తున్నప్పుడు అనిరుధ్‌కి సొంతంగా స్టూడియో లేదు. దాంతో ఏఆర్ రెహమాన్ స్టూడియోలోనే రాత్రంతా కూర్చుని పనిచేసేవాడు. రాత్రంతా మ్యూజిక్ కంపోజ్ చేయడం, పగలు నిద్రపోవడం.. ఇదే అతని రొటీన్‌గా మారిపోయింది. ఈ క్రమంలో పనిలో పడి ఏకంగా ఆరు రోజుల పాటు అనిరుధ్ ఇంటి మొహమే చూడలేదు. కొడుకు ఆరు రోజులైనా ఇంటికి రాకపోయేసరికి తల్లి లక్ష్మి రవిచందర్ తల్లడిల్లిపోయారు. ఆరవ రోజు ఉదయాన్నే కారు తీసుకుని నేరుగా రెహమాన్ స్టూడియోకి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. స్టూడియోలో ఏసీ చలిని తట్టుకోలేక, తల్లిదండ్రులు కొనిచ్చిన కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకుని ఉన్నాడట అనిరుధ్! ఒకపక్క కొడుకు పడుతున్న కష్టం చూసి ఏడుపు వచ్చినా, తన ప్యాషన్ కోసం ఇంతలా శ్రమిస్తున్నాడే అని తల్లిగా ఆమె గర్వపడ్డారు. ఆ కష్టమే ఈరోజు అనిరుధ్‌ని ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలబెట్టింది అనడంలో సందేహం లేదేమో కదా!
Also Read
తాజావార్తలు
-
Anirudh : కీబోర్డ్ కవర్ లోపల దూరి పడుకున్న అనిరుధ్.. గర్వపడ్డ తల్లి!
-
Delhi University: రాహుల్ గాంధీ నిరసనకు వస్తే రూ. 500.. NSUI నేతపై సంచలన ఆరోపణలు!
-
Anirudh Ravichander : పెళ్లి వేళ బయటపడ్డ అనిరుధ్ ‘3 గంటల’ లవ్ స్టోరీ!
-
Anirudh Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వేళ.. అనిరుధ్ సంపాదన ఎంతో తెలుసా.?
-
Censor Board: టాలీవుడ్ నిర్మాతలకు సెన్సార్ కక్షసాధింపు గండం
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!