ఆ ఎవర్ గ్రీన్ పాత్రను మళ్లీ సృష్టించనున్న రావిపూడి…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ‘ఎఫ్2’ సీక్వెల్ ‘ఎఫ్3’ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. ‘ఎఫ్2’లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో కూడా కొనసాగుతున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ప్రారంభమవుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ లో రాజేంద్ర ప్రసాద్ రోల్ ను ఓ ఎవర్ గ్రీన్ పాత్రలా తీర్చిదిద్దుతున్నాడట అనిల్. 1987లో విడుదలైన “అహ నా పెళ్లంట” చిత్రంలో ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు పాత్రను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరు. ఆ సినిమా విడుదలై కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ జనాలు ఆయన పాత్రను ఇప్పటికి ఎంజాయ్ చేస్తారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఎఫ్ 3’ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్‌ను కూడా దాదాపు అలాంటి పాత్రలోనే చూపించబోతున్నాడట అనిల్. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా వేచి చూడాల్సిందే.
Also Read
- 2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
- Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
- Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
తాజావార్తలు
-
India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై బిగ్ అప్డెట్.. ఈ ఫైట్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుదంటే?
-
2026 Tollywood Box Office : ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు చిత్రాలు!
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!