NTV Telugu Site icon

Bagavanth kesari : హిట్ కొట్టాడు.. కారు పట్టాడు..

Anil Ravipudi

Anil Ravipudi

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసర. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతేదాడి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య కు భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.

దసరా కనుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య అభిమానులకు షానా ఏండ్లు యాదుండెలా చేసింది. ఇటీవల ఐఫా అవార్డ్స్ వేడుకల్లోనూ ఈ సినిమా 2023 ఉత్తమ చిత్రం గా అవార్డ్స్ సైతం తెచ్చిపెట్టింది. కాగా ఈ సినిమా భారీ హిట్ అందించినందుకు గాను దర్శకుడు అనిల్ రావిపూడి కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నాడు. షైన్ స్క్రీన్ నిర్మాతలైన సాహు గారపాటి తన బ్యానర్ కు భారీ గిఫ్ట్ అందించినందుకు గాను అనిల్ రావిపూడికి బ్రాండ్ న్యూ టొయోట వెల్‌ఫైర్ కారుని దర్శకుడికి బహుమతిగా అందజేశారు. ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్ లో రూ.1.20 నుంచి రూ.1.30 కోట్ల విలువ ఉంది. హిట్ కొట్టు.. కారు పట్టు..ఇప్ప్పుడు ఇదే టాలీవుడ్ డైరక్టర్లకు లేటెస్ట్ ట్రెండ్. గతంలోను హిట్ సినిమాల దర్శకులకు నిర్మతలు ఇలాంటి కాస్ట్ లి కార్లను బహుమతిగా ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Show comments