ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా 300 కోట్లు కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ సంక్రాంతికి సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం అనే పేరుతో సినిమా చేస్తామని కూడా ప్రకటించారు. అయితే ఈసారి సంక్రాంతికి వచ్చేది వెంకటేష్ తో కాదని తెలుస్తోంది. ఈసారి మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనిల్ రావిపూడి సంక్రాంతికి రాబోతున్నారు. అసలు విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తానని మాటిచ్చారు.
Anshu: అన్షు ‘అంబానీ’ కాదా? ఇలా షాక్ ఇచ్చిందేంటి?
దాని ప్రకారం ఇప్పటికే అనిల్ రావిపూడి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఆ స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మే, జూన్ నెలలో నుంచి సినిమా పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు ఆ సినిమా నిర్మాత సాహు గారపాటి పేర్కొన్నారు. ఆయన నిర్మాతగా విశ్వక్సేన్ హీరోగా తెరకెక్కిన లైలా సినిమా ప్రమోషన్స్ లో ఈ మేరకు ఆయన కామెంట్ చేశారు. వింటేజ్ చిరంజీవిని తీసుకురావడమే లక్ష్యంగా అనిల్ రావిపూడి అండ్ టీం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అనిల్ రావిపూడి మార్కుతో చిరంజీవి సినిమా నుంచి ప్రేక్షకులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఉండేలా కథ సిద్ధం చేస్తున్నట్లు సాహు గారపాటి వెల్లడించారు.