NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?

Nbk 112

Nbk 112

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో మిగిలిన సీనియర్ హీరోలకంటే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపించంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీదుండగానే కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాల. సోషల్ మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కొరటాల తెరెకెక్కించబోయే ఈ సినిమాలో బాలకృష్ణను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. బాలయ్య, రాజశేఖర్ ల మధ్య వచ్చే మైండ్ గేమ్స్ అండ్ యాక్షన్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ముందస్తు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బాలయ్యకు విలన్ గా రాజశేఖర్ పర్ఫెక్ట్ ఛాయస్ అన్ని అనుకూలిస్తే ఈ నెల చివరి వారంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.   కాంబో కొరటాల శివ మార్క్ స్క్రీన్ ప్లే, బాలయ్య బాబు మాస్ డైలాగ్స్, రాజశేఖర్ పవర్‌ఫుల్ విలనిజం కలబోసి ఈ సినిమాపై అంచనాలు  పెంచనున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి మరియు సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

×
×
Ad