Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెర చరిత్రలోనే తిరుగులేని గ్లామర్ క్వీన్‌గా ఒక వెలుగు వెలిగారు స్టార్ యాంకర్ ఉదయభాను. ఆ రోజుల్లో ఆమె టీవీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. లక్షలాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయేవారు. అయితే, ఆ రేంజ్ స్టార్డమ్ తెచ్చిన పిచ్చి అభిమానం ఆమెకు ఎన్ని చుక్కలు చూపించిందో తాజాగా పంచుకుంటూ ఉదయభాను బాంబు పేల్చారు. నెల్లూరుకు చెందిన ఓ వీరాభిమాని ఏకంగా ఆమెకు ‘బంగారు తాళిబొట్టు’ పంపించి, పెళ్లి చేసుకున్నట్లు లెటర్లు రాయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. తాజాగా ఇచ్చిన NTV పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఉదయభాను తన పాత రోజుల్లో ఎదురైన భయంకరమైన అనుభవాన్ని బయటపెట్టారు. “ఒకప్పుడు ఫ్యాన్స్ నుంచి వచ్చే లెటర్లు ఎంతో ముచ్చటగా ఉండేవి. సమయం కేటాయించి మరీ రాసేవారు. కానీ నెల్లూరు వైపు నుంచి ఒక అభిమాని చేసిన పని నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అతను నాకు ఏకంగా ఒక ‘బంగారు తాళిబొట్టు’ పార్శిల్ పంపాడు. అంతేకాదు.. రోజూ ఉత్తరాలు రాస్తూ, అందులో ‘నా శ్రీమతి ఉదయభాను’ అంటూ సంబోధించేవాడు” అని ఆమె గుర్తు చేసుకున్నారు.
కేవలం ఉత్తరాలు, తాళిబొట్టుతో ఆగకుండా ఆ అభిమాని చేసిన రచ్చతో ఉదయభాను తీవ్రమైన మానసిక వేదనను అనుభవించారు. “అసలేం జరుగుతోంది? ఎక్కడి నుంచి వస్తున్నాడు? నన్నేం చేస్తాడోనని బయటకు అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టేది. ఆ టార్చర్ భరించలేక చివరికి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది” అని ఉదయభాను నాటి సంఘటనను పూసగుచ్చినట్లు వివరించారు. వెండితెర హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఉన్న సమయంలో, విపరీతమైన అభిమానం కొన్నిసార్లు ప్రాణాల మీదకు ఎలా తెస్తుందో చెప్పేందుకు ఉదయభాను పంచుకున్న ఈ ఉదంతమే నిదర్శనం. ప్రస్తుతం ఈ సంచలన నిజం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!