NTV Telugu Site icon

Ananya : బాలీవుడ్‌లో‌ మరో బ్రేకప్.. బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టిన హీరోయిన్

Ananya Pandy

Ananya Pandy

బాలీవుడ్ ఇండస్ర్టీలో బ్రేకప్‌లు, విడాకులు కామన్. ఇప్పటికే అలా విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. కలిసి చెట్టపట్టాలేసుకుని తిరగడం. తర్వాత విడిపోవడం మరోకరితో జతకట్టడం అక్కడి వారికి అలవాటే. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. అంతే కాదు మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ బ్రేకప్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.

Also Read: Bhargavi : యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌‌పై మండిపడిన నటి భార్గవి

బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండే హీరోయిన్ గా తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమా తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది అమ్మడు. ఇక అనన్య పర్స్‌నల్ విషయానికి వస్తే ఈ అమ్మడుకు లవ్ స్టోరీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముందుగా అనన్య పాండే ఇషాన్ ఖత్తర్, కార్తిక్ ఆర్యన్ వంటి హీరోలతో డేటింగ్ చేసింది. ప్రజంట్ మాత్రం పీకలోతు ‘ఆశికీ 2’ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో అనన్య పాండే రిలేషన్‌లో ఉందనే వార్తలొచ్చాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆదిత్యరాయ్ కపూర్‌‌కు బ్రేకప్ చెప్పిందట ఈ బ్యూటీ.

ఎప్పుడు ఏదో ఒక్క అప్ డేట్ ఇచ్చే ఈ జంట కొద్ది నెలలుగా వీరిద్దరి నుండి ఎలాంటి వార్తలు బయటకు రావడం లేదు. అయితే తాజాగా తన బ్రేకప్‌పై ఓపెన్ కామెంట్స్ చేసింది అనన్య. ‘బ్రేకప్ తర్వాత తన ఎక్స్-బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టాను, ఫొటోలు అలా కాల్చిన తర్వాత చాలా బాధ తగ్గింది. రిలేషన్ షిప్‌లో నేను చాలా కాంప్రమైజ్ అయ్యాను, కానీ చెడ్డ వ్యక్తుల పట్ల మరీ అంత మంచిగా ఉండాల్సిన అవసరం లేదు. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు భాగస్వామిలో కేవలం మంచిని మాత్రమే చూశాను, అతడి కోసం ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాను, అలా నను నేను మార్చుకున్నాను. మనల్ని మనం పూర్తిగా అర్పించుకున్నప్పుడే ప్రేమకు అర్థం, ఇదే సమయంలో ఎదుటి వ్యక్తి నుంచి అది ఆశించడంలో తప్పు లేదు. నేను భాగస్వామి నుంచి ఆశించినప్పుడు ఎదురుదెబ్బ తగిలింది’ అని చెప్పుకొచ్చింది.