Site icon NTV Telugu

Ananya Nagalla: నాకు కాబోయే హస్బెండ్ ఆ హీరో లాగే ఉండాలి: అనన్య

Ananya Nagalla: అనన్య నాగళ్ళ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో కీలక పాత్రలో నటించి అందరి దృష్టిలో పడింది. వకీల్ సాబ్ అనన్యకు మంచి బ్రేక్ ఇచ్చింది కానీ.. అవకాశాలను మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో అవకాశాల కోసం తానే కష్టపడుతోంది. ఎప్పటికపుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూనే.. అందాల ఆరబోతకు తానేం అతీతం కాదని, అన్ని పాత్రలు చేయగలను అంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో డైరెక్టర్లకు హింట్ ఇస్తోంది. అలాగే గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ సోషల్ మీడియాలో గ్లామర్ సంకేతాలు ఇస్తుంది.

Also Read; Gaami OTT : ఓటీటీలోకి రాబోతున్న విశ్వక్ సేన్ హిట్ మూవీ.. ఎప్పుడు స్ట్రీమింగంటే?

ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తంత్ర. మార్చి 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా పరంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. ఒక ఇంటర్వ్యూలో ఈ చిన్నది తనకి కాబోయ్ హస్బెండ్ ఎలా ఉండాలి అని అడిగితె.. నాకు ఇలాంటి హస్బెండ్ కావాలని చెప్పింది. ‘నాని నటించిన హాయ్ నాన్న మూవీలో నాని క్యారెక్టర్ లాంటి అబ్బాయి కావాలి. గ్రీన్ ఫ్లాగ్ అయ్యి ఉండాలి. రిలేషన్షిప్స్ అంటే ఎప్పుడు హ్యాపీగా ఫ్రెండ్స్ లా ఉండాలి’అని అనన్య చెప్పుకొచ్చింది.

Exit mobile version