Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన రష్మిక.. తనదైన చలాకీతనంతో వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ రష్మికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సందర్భంగా అభిమానులు రష్మికను ‘వదినా.. వదినా’ అంటూ పిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘బేబీ’ సినిమాలోని ‘ప్రేమిస్తున్నా’ పాట సమయంలో రష్మికను చూసిన అభిమానులు ‘వదినా.. వదినా’ అంటూ నినాదాలు చేశారని ఆనంద్ గుర్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో తాను ఆ మాటను చెప్పలేకపోయానని తెలిపారు. ఇప్పుడు మాత్రం పూర్తి ప్రైడ్‌తో ‘వదినమ్మ’ అని పిలుస్తున్నానంటూ రష్మికను ఉద్దేశించి ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. తాను సాధారణంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తిని కాదని, ఇంట్లో కూడా పెద్దగా మాట్లాడనని ఆనంద్ తెలిపారు. అయితే రష్మిక తనను ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. ఇటీవల తాను ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో కాలేజీలకు వెళ్తున్న సమయంలో.. తన ఇంటర్వ్యూలు చూసి రష్మిక మెసేజ్ చేసిందని వెల్లడించారు. ‘నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఇలాగే కొనసాగించు. కానీ నీ ముఖంలో ఏదో స్ట్రెస్ కనిపిస్తోంది. ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా?’ అంటూ రష్మిక తనకు మెసేజ్ చేసిందని ఆనంద్ తెలిపారు. ఇలాంటి సపోర్ట్ ఎప్పుడూ తనకు ఉంటుందని, తనకు విజయ్ దేవరకొండ లాంటి బ్రదర్‌తో పాటు ఇంత మంచి వదిన ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
‘ఎపిక్’ అనే టైటిల్ ఎందుకు పెట్టారనే విషయాన్ని కూడా ఆనంద్ వివరించారు. ఎపిక్ అంటే భారీ సినిమా, పెద్ద కథ అని అనుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. మనందరి జీవితాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు, ప్రేమలోని అందమైన క్షణాలే నిజమైన ‘ఎపిక్ మూమెంట్స్’ అని అన్నారు. మనకు ఒత్తిడిగా ఉన్న సమయంలో మన పార్ట్నర్ ఒక్కసారిగా చేయి పట్టుకుంటే ధైర్యం వస్తుందని.. నుదుటిపై ముద్దు పెడితే సంతోషంగా అనిపిస్తుందని చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న క్షణాలు కూడా మన జీవితాల్లో ఎపిక్ మూమెంట్స్గానే నిలిచిపోతాయని పేర్కొన్నారు. ‘ఎపిక్’ సినిమాలో ఇలాంటి అందమైన క్షణాలు చాలా ఉంటాయని ఆనంద్ తెలిపారు. కొత్త కథలు, కొత్త ఆలోచనలు రావాలంటే కొత్త దర్శకులు ఇండస్ట్రీలోకి రావాల్సిన అవసరం ఉందని ఆనంద్ అన్నారు. ‘ఎపిక్’తో డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఓ కొత్త పాయింట్ ఆఫ్ వ్యూను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఆదిత్య హాసన్ ప్రతి మనిషి జీవితాన్ని ఎంతో నిశితంగా గమనించే వ్యక్తి అని ఆనంద్ చెప్పారు. అతనితో మాట్లాడితే థెరపీ సెషన్‌లా అనిపిస్తుందని, తన ఆలోచనలను కూడా అతనితో షేర్ చేసుకుంటానని తెలిపారు. ‘ఎపిక్’ కేవలం కామెడీ లేదా బ్రీజీ లవ్ స్టోరీ మాత్రమే కాదని.. ప్రేక్షకులు తమ సంబంధాలు, తల్లిదండ్రులతో తమ అనుబంధం, బాధ్యతల గురించి ఆలోచించేలా చేసే ఎమోషనల్ మూవీ అని వివరించారు.
Also Read
- Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
- Vaishnavi : "గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు"
- Rashmika : "ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్".. 'ఎపిక్' వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
‘ఎపిక్’లో వైష్ణవి చైతన్య తన పాత్రను అద్భుతంగా పోషించిందని ఆనంద్ ప్రశంసించారు. ఈ పాత్ర కోసం ఆమె చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ తనను, డైరెక్టర్ ఆదిత్య హాసన్‌ను ఆశ్చర్యపరిచిందన్నారు. కళ్లతోనే ఎంతో భావోద్వేగాన్ని పలికించే అద్భుతమైన నటి వైష్ణవి అని కొనియాడారు. ఆమె మంచి స్టోరీలను ఎంచుకుంటూ భవిష్యత్తులో తెలుగు ఇండస్ట్రీలో 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుండిపోయే నటిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘ఎపిక్’ చాలా రోజుల తర్వాత వస్తున్న అందమైన లవ్ స్టోరీ అని ఆనంద్ అన్నారు. ఈ సినిమాను ‘ఏ మాయ చేసావే’, ‘ప్రేమలు’ సినిమాల అందమైన ప్రేమ కథల మేళవింపుగా అభివర్ణించారు. సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్‌తో కలిసి పనిచేయడం తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. చివరగా సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ థియేటర్లలోకి వస్తుందని.. ఇది బ్రీజీగా సాగుతూనే ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలించే రొమాంటిక్ కామెడీ అని ఆనంద్ తెలిపారు. ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సినిమాను ఆదరించాలని కోరారు.
తాజావార్తలు
-
Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
-
Kavin: కెవిన్ కవల పిల్లలకు ఆ పేర్లు.. ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన హీరో!
-
Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?
-
Kerala Road A*ccident: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు, 8 మంది మృతి
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!