Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anand Deverakonda on Vaishnavi Chaitanya Relationship: ‘బేబీ’ సినిమాతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఈ సినిమాలో వీరిద్దరూ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. బేబీలో ఆనంద్, వైష్ణవి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ జంట మరోసారి కలిసి నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s’ వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఎపిక్ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బేబీ’ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీ కారణంగా.. వీరిద్దరూ నిజ జీవితంలో కూడా రిలేషన్షిప్లో ఉన్నారంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. ఇప్పుడు ఎపిక్ వస్తుండంతో ఆ రూమర్స్ మరింత ఎక్కువయ్యాయి. అందుకు కారణం.. కథలో రిలేషన్‌షిప్‌నకు సంబంధించిన బోల్డ్ కంటెంట్, కిస్ సీన్స్ ఉండటంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. ఎపిక్ ప్రమోషన్స్‌లో హీరో ఆనంద్ దేవరకొండకు ఇదే విషయంపై ఓ ప్రశ్న ఎదురైంది. వైష్ణవి చైతన్యతో రిలేషన్షిప్లో ఉన్నారంటూ జరిగిన ప్రచారంపై స్పందిస్తూ.. తమ మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమేనని స్పష్టం చేశాడు.
Also Read
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
వైష్ణవి చైతన్య, తాను మంచి స్నేహితులమని.. అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఆనంద్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరం కలిసి రెండో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారం జరిగి ఉండొచ్చని చెప్పాడు. దీంతో ఇన్నాళ్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. బేబీ తర్వాత ఆనంద్, వైష్ణవి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఎపిక్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ హిట్ పెయిర్ మరోసారి ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!